హైదరాబాద్ లోని సైబరాబాద్ లో సైబర్ కేటుగాళ్లు కొత్తరకం మోసానికి తెర లేపారు.ఓ కంపెనీని చేజిక్కించుకునేందుకు సైబర్ దాడులకు పాల్పడ్డారు.
ప్రముఖ కంపెనీ అయిన హాంగర్ టెక్నాలజీ సంస్థపై కొత్త రకం సైబర్ దాడులు జరిగినట్లు సమాచారం.కంపెనీపై దాడి చేసిన కేటుగాళ్లు డేటా చేజిక్కించుకున్నట్లు తెలుస్తోంది.
అయితే సైబర్ అటాక్ కు పాల్పడిన నిందితులు గత కొన్ని సంవత్సరాలుగా ఇదే కంపెనీలో ఉద్యోగులుగా పని చేయడం గమనార్హం.ఈ నేపథ్యంలో హాంగర్ టెక్నాలజీ ఇచ్చిన ఫిర్యాదుపై సైబర్ క్రైం పోలీసులు కేసు నమోదు చేశారు.
దర్యాప్తులో భాగంగా సైబర్ దాడులు చేసిన నిందితులను అదుపులోకి తీసుకున్నారు.అనంతరం వారి వద్ద నుంచి ఓ రివాల్వర్ తో పాటు పది బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం.
అంతేకాకుండా అమెరికాలో ఉన్న మరో నిందితుడి కోసం లుకౌట్ నోటీసులు జారీ చేశారు.







