నేటితరం హీరోలలో విశ్వనాథ్ గారికి నచ్చిన హీరో ఎవరో తెలుసా?

కళాతపస్వి కె విశ్వనాథ్ గారు అనారోగ్య సమస్యల కారణంగా గురువారం రాత్రి 11 గంటల సమయంలో ఆఖరి శ్వాస వదిలిన విషయం మనకు తెలిసిందే.

ఇలా వయో వృద్ధాప్య సమస్యల కారణంగా లెజెండరీ డైరెక్టర్ కళాతపస్వి కె విశ్వనాథ్ తుది శ్వాస వదిలారు.

ఇక ఈయన మరణ వార్త తెలుసుకున్న టువంటి సినీ సెలబ్రిటీలు పెద్ద ఎత్తున తరలివచ్చి ఈయనకు నివాళులు అర్పించారు.ఇక విశ్వనాధ్ గారి అంత్యక్రియలు జూబ్లీహిల్స్ లోని స్మశాన వాటికలో సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు.

Do You Know Who Is Vishwanaths Favorite Hero Among Todays Heroes ,vishwanath ,

విశ్వనాథ్ గారు సుమారు 50 సినిమాలకు దర్శకత్వం వహించారు.అయితే ఈయన దర్శకత్వంలో వచ్చిన ప్రతి ఒక్క సినిమా కూడా ఓ ఆణిముత్యమే అని చెప్పాలి.ఇలా ఎన్నో అద్భుతమైన చిత్రాలను ప్రేక్షకులకు అందించి ఎన్నో అవార్డులను పురస్కారాలను అందుకున్నటువంటి దర్శకుడికి ఒక హీరో నచ్చడం అంటే సర్వసాధారణమైన విషయం కాదు.

ఇలా డైరెక్టర్ విశ్వనాథ్ గారికి ఈ తరంలో నచ్చిన హీరో గురించి గతంలో ఈయన ఒక ఇంటర్వ్యూ సందర్భంగా వెల్లడించారు.

Do You Know Who Is Vishwanaths Favorite Hero Among Todays Heroes ,vishwanath ,
Advertisement
Do You Know Who Is Vishwanath's Favorite Hero Among Today's Heroes ,vishwanath ,

ఈ సందర్భంగా నేటితరం హీరోలలో ఏ హీరో అంటే మీకు ఇష్టం అంటూ ఈయనకు ఓ ప్రశ్న ఎదురయింది.అయితే ఈ ప్రశ్నకు విశ్వనాథ గారు సమాధానం చెబుతూ ప్రస్తుతం ఉన్నటువంటి యంగ్ హీరోలందరూ కూడా అద్భుతమైన నటనను కనబరుస్తున్నారని తెలిపారు.అయితే అందరిలో కన్నా తనకు జూనియర్ ఎన్టీఆర్ అల్లు అర్జున్ నటన చాలా బాగా నచ్చుతుందని విశ్వనాథ్ తెలిపారు.

ఇలా వీరిద్దరి నటన నచ్చుతుంది అంటే మిగతా హీరోలు మంచిగా నటించరని అర్థం కాదు అంటూ గతంలో విశ్వనాథ్ గారు చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు