మహేష్ బాబు రాజమౌళి సినిమాకి సినిమాటోగ్రాఫర్ ఎవరో తెలుసా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో తన సినిమాల ద్వారా వరుస సక్సెస్ లను అందుకున్న రాజమౌళి ఆ తర్వాత బాహుబలి సినిమాతో పాన్ ఇండియా లో సూపర్ సక్సెస్ లను అందుకుంటూ ముందుకు సాగుతున్నాడు.

ఇక ఇప్పుడు ఆయన మహేష్ బాబుతో ( Mahesh Babu )పాన్ వరల్డ్ లో ఒక సినిమా చేయబోతున్నట్లుగా తెలుస్తుంది.

ఇక రాజమౌళికి ఆస్థాన సినిమాటోగ్రాఫర్ గా ఉన్న సెంథిల్ కుమార్ ( Senthil Kumar ) ప్రస్తుతం మహేష్ బాబు సినిమా కోసం కూడా అతనే ఉంటాడని అందరూ అనుకున్నారు.

కానీ ఆయనకి ఉన్న కొన్ని పర్సనల్ పనుల వల్ల ఈ ప్రాజెక్టు నుంచి తను తప్పుకోబోతున్నట్లుగా కూడా వార్తలైతే వస్తున్నాయి.ఇక ఈ సినిమా కోసం హాలీవుడ్ సినిమాటోగ్రాఫర్( Hollywood cinematographer ) ను తీసుకోవాలనే ఉద్దేశ్యంలో రాజమౌళి ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది.ఇక ఈ సినిమాను మొత్తానికైతే విజువల్ వండర్ గా తెరకెక్కించాలనే ప్రయత్నంలో రాజమౌళి ఉన్నట్టుగా తెలుస్తుంది.

ఇక అందుకోసమే ఈ సినిమాకి సంబంధించిన స్టోరీని మలిచాడు.మరి విజువల్స్ ప్రకారం రాజమౌళి ఎక్కడ తగ్గకుండా ఆ గ్రాండియర్ ని స్క్రీన్ మీద చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాడు.

Advertisement

ఇక ఇంతకుముందు బాహుబలి లాంటి సినిమాలకు నాలుగు నుంచి ఐదు వందల కోట్ల వరకు ఖర్చుపెడితేనే అంత గ్రాండ్గా సినిమాను తీశాడు ఇక ఈ సినిమా కోసం ఏకంగా 1000 కోట్ల వరకు ఖర్చు పెడితే ఇంకా ఈ సినిమాను ఎలాంటి రిచ్ నెస్ తో ఈ సినిమా చేస్తాడు అనేది తెలియాల్సి ఉంది.ఇక మొత్తానికైతే ఈ సినిమాల వల్ల ఆయన తెలుగు సినిమా స్థాయిని వరల్డ్ లో నిలబెట్టబోతున్నాడనే విషయం మాత్రం చాలా స్పష్టంగా తెలుస్తుంది.ఇక ఈ సినిమాతో ఆస్కార్ అవార్డు కొట్టడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు.

చూడాలి మరి ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ ఇస్తుంది అనేది.

Advertisement

తాజా వార్తలు