ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో గోల్డెన్ లెగ్, హిట్ హీరోయిన్గా పేరు సంపాదించుకున్న నటి సంయుక్త మీనన్ ( Samyuktha Menon ) తాజాగా విరూపాక్ష సినిమా ( Virupaksha Movie ) ద్వారా మరొక సక్సెస్ తన ఖాతాలో వేసుకున్నారు.ఈమె బీమ్లా నాయక్ సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి మంచి విజయాన్ని అందుకున్నారు.
అనంతరం ఈమె నటించిన సార్, బింబిసారా ( Sir, Bimbisara )వంటి సినిమాలు కూడా సూపర్ సక్సెస్ అందుకున్నాయి.ఇలా ఈమె నటించిన సినిమాలన్నీ వరుసగా హిట్ అవడంతో ఈమెను గోల్డెన్ లెగ్ అంటూ సంభోదిస్తున్నారు.
ఇక తాజాగానా ఈమె నటించిన విరూపాక్ష సినిమా కూడా అద్భుతమైన ఆదరణ సంపాదించుకోవడమే కాకుండా కలెక్షన్ల పరంగా దూసుకుపోతుంది.
ఇక ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి సంయుక్త గతంలో జరిగినటువంటి సంఘటన గురించి గుర్తు చేసుకున్నారు.కొన్ని సంవత్సరాల క్రితం తన తల్లితో కలిసి ఈమె బయటకు వెళ్ళగా అక్కడ తాను ఒక వ్యక్తి చంప పగలగొట్టానంటూ తెలియజేశారు.అయితే ఈమె ఆ వ్యక్తిని కొట్టడానికి గల కారణాన్ని కూడా తెలిపారు.
తన తల్లి ఆమె ఒకచోట నిలబడి ఉండగా ఒక వ్యక్తి సిగరెట్ తాగుతూ పొగ వదులుతున్నారని తెలిపారు.అయితే అమ్మకు శ్వాస కోశ సమస్య ఉండటం వల్ల అక్కడి నుంచి పక్కకు వెళ్దామని ప్రయత్నించిన వెళ్లలేని పరిస్థితి ఉండడంతో అక్కడే నిలబడిపోయామని తెలిపారు.
ఇక ఆ వ్యక్తి సిగరెట్ పొగ( Cigarette smoke ) అలాగే వదులుతూ ఉండటంతో అమ్మ చాలా ఇబ్బంది పడింది దీంతో ఆ వ్యక్తి వద్దకు వెళ్లి అమ్మకు ఈ సమస్య ఉంది ఆపేయండి అని రిక్వెస్ట్ చేశాను.కానీ ఆ వ్యక్తి తమ పట్ల ఎంతో అసభ్యకరంగా మాట్లాడారని దాంతో కోపం వచ్చి లాగి చెంపపై ఒకటి ఇచ్చానని ఈ సందర్భంగా సంయుక్త మీనన్ గతంలో జరిగిన సంఘటన గురించి తెలియజేస్తూ చేసినటువంటి ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.ఈమె కామెంట్స్ విన్నటువంటి నెటిజన్స్ సంయుక్త మీనన్ చాలా డేరింగ్ పర్సన్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.