పూజలో పంచామృతం విశిష్టత ఏమిటో తెలుసా?

మన హిందూ సాంప్రదాయాల ప్రకారం ఏదైనా శుభకార్యం జరిగినప్పుడు లేదా ఆలయాలలో ఏదైనా స్వామివారికి అభిషేకాలు నిర్వహిస్తున్న సమయంలో పంచామృతాలు ఉపయోగిస్తారు.

ఇలా పంచామృతాలతో అభిషేకం చేయటం వల్ల స్వామివారికి చెందుతాయని భావిస్తారు.

ఎంతో పవిత్రంగా భావించే ఈ పంచామృతానికి ఎందుకు అంత ప్రాముఖ్యతనిస్తారు ఈ పంచామృత విశిష్టత ఏమిటి అనే విషయాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.సాధారణంగా పంచామృతాన్ని ఆవుపాలు, ఆవుపెరుగు, ఆవునెయ్యి, తేనె చెక్కెరతో కలిపి తయారుచేస్తారు.

ఇలా ఐదు పదార్థాలతో తయారు చేస్తారు కనుక దీనిని పంచామృతం అని పిలుస్తారు.ఈ విధంగా పంచామృతముతో అభిషేకం చేసి పంచామృతం తినటం వల్ల ఆధ్యాత్మిక పరంగా మాత్రమే కాకుండా ఆరోగ్యపరంగా కూడా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.

పంచామృతంలో ఉపయోగించే ఆవుపాలు ఆవుపెరుగు లో ఉన్న పోషక పదార్థాలు ఉంటాయి.ఈ విధమైనటు వంటి పోషక పదార్థాలతో ఎముకలకు పటుత్వాన్ని కల్పించడమే కాకుండా జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది మన శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుంది.

Advertisement

ఈ పదార్థాలు సహజంగానే ఎంతో అమృతం అయినవి కనుక వీటిని పంచామృతాలు అని పిలుస్తారు.మన పెద్దలు వీటి సమ్మేళనానికి పంచామృతం అని పేరు పెట్టారు.పూజాదికాల్లో పంచామృతం ఉపయోగించడం వల్ల ఎంతో పవిత్రత కలిగి ఉందని చెప్పవచ్చు.

అందుకోసమే పంచామృతానికి ఎంతో ప్రాధాన్యతను ఇస్తారు.

Advertisement

తాజా వార్తలు