ఉమెన్స్ ప్రీమియర్ లీగ్( Women’s Premier League ) తొలి సీజన్ విజేతలకు బీసీసీఐ( BCCI ) భారీ రికార్డు ప్రైజ్ మనీ ఇచ్చి ఆశ్చర్యపరిచింది.తొలి టైటిల్ ను కైవసం చేసుకున్న ముంబై ఇండియన్స్ కు రూ 6 కోట్ల రూపాయల ప్రైజ్ మనీ అందించింది.
ఇక రన్నరప్ గా నిలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ కు మూడు కోట్ల ప్రైస్ మనీ అందజేశారు.మహిళల క్రికెట్ లీగ్ లో ఎక్కువ ప్రైజ్ మనీ ఒక్క డబ్ల్యూపీఎల్ ప్రైజ్ మనీ నే కావడం చర్చనీయాంశమైంది.ఎందుకంటే ఆస్ట్రేలియా వేదికగా జరిగే బిగ్ బాష్ లీగ్ ప్రైజ్ మనీ రూ.2.7 కోట్లు, ఇంగ్లాండ్లో నిర్వహించే ది హండ్రెడ్స్ లీగ్ ప్రైజ్ మనీ రూ.1.5 కోట్లు.ఇక పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ ఆధ్వర్యంలో నిర్వర్తించే పీఎస్ఎల్ ప్రైజ్ మనీ రూ.3.4 కోట్లు.</br
బీసీసీఐ డబ్ల్యుపీఎల్( Wpl ) లో ఇచ్చిన ప్రైజ్ మనీ ఇతర ప్రైజ్ మనీ లకు రెట్టింపు స్థాయిలో ఉండడం అందర్నీ ఆశ్చర్యపరిచింది.డబ్ల్యూపీఎల్ లో బెస్ట్ ప్లేయర్ల విషయానికి వస్తే, ఆరెంజ్ క్యాప్: మెగ్ లానింగ్ ( ఢిల్లీ క్యాపిటల్స్) – 345 పరుగులు.పర్పుల్ క్యాప్: హేలీ మాథ్యూస్ (ముంబై ఇండియన్స్)- 16 వికెట్లు, హైయెస్ట్ స్కోర్: సోఫీ డివైన్ (అర్సీబీ) – 99 పరుగులు, బెస్ట్ బౌలింగ్: మరియనె కాప్ ( ఢిల్లీ క్యాపిటల్స్) 5-15, మోస్ట్ సిక్సెస్: షేఫాలీ వర్మ (13), మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ హేలీ మాథ్యూస్, ఎమర్జింగ్ ప్లేయర్: యస్తికా భాటియా, క్యాచ్ ఆఫ్ ది సీజన్: హర్లీన్ డియోల్ (గుజరాత్ జెయింట్స్).ఇక 2022 ఐపీఎల్ సీజన్లో విన్నర్ గుజరాత్ టైటాన్స్ కు రూ.20 కోట్ల ప్రైజ్ మనీ అందించింది బీసీసీఐ.