అబ్బే కెమెరాకు పనికొచ్చే మొహం కాదండి, మెగాస్టార్ కడుపున ఇలాంటి కొడుకు ఎలా పుట్టాడో, మొహం లో ఒక్క ఎక్స్ప్రెషన్ కూడా పలకడం లేదు ఎలా హీరో అవుతాడు, హీరో కొడుకు అయితే హీరో అయిపోతాడా, డబ్బులున్నాయి కాబట్టి హీరో చేయగలిగాడు చిరంజీవి లేదంటే ఇతను ఫేస్ ఎవరు చూస్తారు చెప్పండి… అంటూ ఎన్నో కామెంట్స్.మొదటి సినిమా విడుదలైన రోజు నుంచి రాంచరణ్( Ramcharan ) ని చిరంజీవితో పోలుస్తూ చిరంజీవి కొడుకు కంటే చిరంజీవి లాగానే ఉండాలని లైన్స్ పెట్టుకొని దారుణంగా కామెంట్స్ చేశారు.
కానీ అతడు చిరంజీవి కొడుకు అంత ఈజీగా ఓటమిని ఒప్పుకోడు.ఈ పుట్టిన రోజు సందర్భంగా ఎన్నో అవమానాల నుంచి నేడు ఆస్కార్( Oscar ) వరకు ఎదిగిన రామ్ చరణ్ గురించి తెలుసుకుందాం.
చిరుత సినిమా( Chirutha ) ద్వారా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు రామ్ చరణ్.ఈ సినిమా పూరి జగన్నాథ్( Puri Jagannath ) దర్శకత్వంలో తెరకెక్కి మంచి వసూళ్లను అయితే సాధించింది కానీ రామ్ చరణ్ విషయంలో చాలామంది అసంతృప్తికి లోనయ్యారు.ఇక ఆ సినిమా నుంచి బయటపడ్డ రెండవ సినిమా మగధీర( Magadhira ).ఈ చిత్రం చూసిన తర్వాత నాడు అడ్డగోలు కామెంట్స్ వేసిన నోళ్ళు మూతపడ్డాయి.రెండో సినిమాకే మొదటి సినిమాకి ఎంతో తేడా కనిపించింది ఎలా ఇంతటి నటుడు ఇలా ట్రోల్ కి గురయ్యాడు అని బాధేసింది.రాజమౌళి చరణ్ లోని నటుడిని బయటకు తీసుకొచ్చాడు.
ఆ తర్వాత ఎన్నో సినిమాలు తీశాడు హిట్స్ పైన హిట్స్ కొట్టాడు కానీ అప్పటికి ఇప్పటికీ పెద్ద తేడా ఏమీ లేదు ఒక్క మగధీర సినిమా తప్ప.జంజీర్ సినిమాలో రామ్ చరణ్ నటనకు బాలీవుడ్ మీడియా దారుణంగా ట్రోల్ చేసింది.</br
అప్పుడు వచ్చాడు మన చిట్టి గాడు.రంగస్థలం( Rangasthalam ) సినిమా రామ్ చరణ్ కెరియర్ లో గొప్ప చిత్రమని చెప్పొచ్చు.మగధీర సినిమా క్రెడిట్ ఎక్కువగా రాజమౌళికే వెళ్ళింది కానీ చిట్టి బాబు గారు రంగస్థలం సినిమాలో అతడి పూర్తిస్థాయి నటన కనిపించింది.ప్రతి ఊరికి ఒక చిట్టిబాబు ఉండేలా చేసింది ఆ సినిమా తర్వాత ఇప్పుడు ఆస్కార్లు ఒడిసి పట్టుకున్న ఆర్ఆర్ఆర్.
రామ్ చరణ్ ఎన్నో అవమానాల నుంచి ఆస్కార్ వరకు ఎదిగాడు ఇదేమి మామూలుగా జరిగిన ప్రయాణం కాదు 2007 నుంచి 2023 వరకు ఎన్నో ఎన్నో జరుగుతూనే వచ్చాయి తీసిన ప్రతి సినిమాతో పాఠాలు నేర్చుకుంటూనే వచ్చాడు.ఇక ప్రస్తుతం రామ్ చరణ్ కి 38వ పడి లోకి ప్రవేశించాడు.
త్వరలోనే తండ్రి కూడా కాబోతున్నాడు ఇక పుట్టినరోజు సందర్భంగా అతడి కొత్త సినిమా పోస్టర్ లాంచ్ జరిగింది.అదే గేమ్ చేంజర్ అనే సినిమా.ఇది తమిళ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో వస్తుంది.