నమఃశివాయ అంటే అర్థం ఏమిటో తెలుసా?

నమశిఃవాయ అనే పదం మనం చాలా సార్లే విని ఉంటాం.వినడమే కాదు రోజులో చాలా సార్లు మనసులో కూడా అనుకొని ఉంటాం.

నమఃశివాయ అంటే ఆ పరమ శివుడిని గుర్తు చేసుకోవడమే, ధ్యానించడం మాత్రమే కాదండోయ్.నమఃశివాయలో .‘న’ అంటే నభం అంటే ఆకాశం అని అర్థం.అలాగే ‘మ’ అంటే మరుత్‌.

అంటే వాయువు.‘శి’అంటే శిఖి.

అనగా అగ్ని అని అర్థం.అలాగే ‘వా’ అంటే వారి.

Advertisement

అనగా జలం.అంతే కాకుండా ‘య’ అంటే యజ్ఞం.యజ్ఞానికి భూమి అనే అర్థం వస్తుంది.

అయితే ఈ అయిదింటికీ ఓంకార నామాన్ని చేర్చి ఉచ్చరించడం వల్ల ఆది దేవుని అనుగ్రహం పొంది సర్వ పాపాలూ హరించి పోతాయని పురాణాలు చెబుతున్నాయి.అలాంటి పంచ భూతాత్మకుడైన పరమ శివుడిని నమఃశివాయ అనే మంత్రంతో స్మరిస్తాం.

ఆ పరమ శివుడిలోని స్వార్థం లేని తనం, భోలాతనం కలగలిపిన నిరాడంబరత, నిస్వార్థాన్ని గురించి ఈ మంత్రం చెబుతుంది.అలాగే మన మనసు ఈ సుగుణాలన్నింటితో పరిపూర్ణ స్థితిలో శరీర ధర్మాల నుంచి ఆ సర్వేశ్వరుని పాదాల చెంత చేరి ముక్తిని ప్రసాదించమని వేడుకోనుందుకే శివ పంచాక్షరీ స్తోత్రాన్ని రచించారు.

ఆ మంత్రంలోని ముఖ్య ఉద్దేశం కూడా ఇదే.అయితే ఓం నమః శివాయ మంత్రాన్ని ఎప్పుడు పడితే అప్పుడు స్మరించకూడదు.ఈ మంత్రాన్ని జపించేందుకు కొన్ని నియమ, నిష్టలు కూడా ఉన్నాయి.

హెచ్‎సీయూ విద్యార్థి రోహిత్ వేముల కేసు క్లోజ్..!
కనుమ రోజున పొలిమేర ఎందుకు దాటకూడదు..?

తెల్లవారు జామునే నిద్ర లేచి.తలస్నానం ఆచరించి నిటారుగా కూర్చోవాలి.

Advertisement

ఆ తర్వాత కళ్లు మూసుకుని, జప మాల తీసుకుని ‘ఓం నమ: శివాయ‘ మంత్రాన్ని జపించడం మొదలు పెట్టాలి.ఇలా శివ పంచాక్షరీ స్తోత్రాన్ని చదవితే.

ఆ పరమేశ్వరుడు కచ్చితంగా మనల్ని కరుణిస్తాడు.

" autoplay>

తాజా వార్తలు