నాగార్జున చేయాల్సిన సినిమాను కమల్ హాసన్ చేసి సూపర్ హిట్ అందుకున్నాడనే విషయం మీకు తెలుసా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న నటుడు నాగార్జున( Nagarjuna).

ప్రస్తుతం ఆయన తనదైన రీతిలో సినిమాలను చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు.

అయితే ఒకానొక సందర్భంలో నాగార్జున చేయాల్సిన సినిమాని కోలీవుడ్ స్టార్ హీరో అయిన కమల్ హాసన్ చేసి సక్సెస్ ని అందుకున్న విషయం మనలో చాలామందికి తెలియదు.

ఇక వివరాల్లోకి వెళితే కె విశ్వనాథ్( K.Viswanath ) డైరెక్షన్ లో కమల్ హాసన్ చేసిన శుభసంకల్పం సినిమాని మొదట నాగార్జునతో చేయాలని అనుకున్నారట.కానీ నాగార్జున సినిమాలో నటిస్తాడా లేదా అనే డౌట్ తో కె విశ్వనాథ్ ఈ సినిమాను కమల్ హాసన్ కి చెప్పి అతనితో చేయించాడు.

ఇక దీనికంటే ముందే వీళ్ళ కాంబోలో సాగర సంగమం, స్వాతిముత్యం లాంటి రెండు సూపర్ హిట్ సినిమాలు రావడంతో కమల్ హాసన్ కూడా ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.ఒకవేళ నాగార్జున కనక ఈ సినిమా చేసినట్లయితే తనకు ఒక స్పెషల్ గుర్తింపు అయితే వచ్చుండేది.

Advertisement

ఇక నాగార్జున ఇలాంటి పాత్రలు చేయగలడా అంటే తప్పకుండా చేయగలడు.

ఎందుకంటే తను మాస్ హీరోగా రొమాంటిక్ హీరోగా ఉన్న సమయంలోనే అన్నమయ్య ( Annamayya )లాంటి ఒక భక్తి రస ప్రధానమైన చిత్రాన్ని చేసి సూపర్ సక్సెస్ ని అందుకున్నాడు.కాబట్టి నాగార్జునని తక్కువ అంచనా వేయడానికి వీలు లేదు అంటూ మరికొంతమంది సినిమా మేధావులు సైతం వాళ్ల అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.ఇక నిజానికి నాగార్జున కనక ఈ సినిమా చేసి ఉంటే ఆయనకి సపరేటు గుర్తింపు అయితే వచ్చుండేది.

కానీ ఆ సినిమాకి నాగార్జున పూర్తిస్థాయిలో న్యాయం చేసేవాడు కాదని మరి కొంతమంది వాళ్ల అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.ఇక మొత్తానికైతే కమల్ హాసన్ ఈ సినిమాతో స్టార్ హీరోగా వెలిగొందాడు.

ప్రపంచవ్యాప్తంగా ట్రెండింగ్ లో కల్కి.. ప్రభాస్ ఖాతాలో మరిన్ని సంచలనాలు నమోదయ్యాయా?
Advertisement

తాజా వార్తలు