సిటాడేల్ కోసం సమంత రెమ్యూనరేషన్ తెలిస్తే షాకవ్వాల్సిందే... ఎంతంటే?

హాలీ వుడ్ ఇండస్ట్రీలో ప్రియాంక చోప్రా రిచర్డ్ మాడెన్ నటించిన సిటాడేల్ ( Citadel ) వెబ్ సిరీస్ ను ఇండియన్ వెర్షన్‌లో వరుణ్ ధావన్( Varun Dhawan ) , సమంత ప్రధాన పాత్రలో కనిపించనున్నారు.

ఈ వెబ్ సిరీస్ షూటింగ్ మొత్తం పూర్తి అయ్యింది.

త్వరలోనే ఈ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియో ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది.రాజ్ అండ్ డీకే( Raj and DK ) దర్శకత్వంలో తెరకెక్కినటువంటి ఈ వెబ్ సిరీస్ పై భారీ అంచనాలే ఉన్నాయి ఈమె ఇదివరకే వీరి దర్శకత్వంలో ది ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్( The Family Man ) లో నటించి బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.

ది ఫ్యామిలీ మెన్ సిరీస్ ద్వారా మాత్రమే కాకుండా పుష్ప సినిమా( Pushpa Movie ) ద్వారా సమంత స్పెషల్ సాంగ్ లో సందడి చేస్తే బాలీవుడ్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది దీంతో ఈమెకు బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఎంతో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ రావడంతో ఈ వెబ్ సిరీస్ లో కూడా ఈమె భాగమయ్యారు.సమంత( Samantha ) కెరియర్ లోనే ఈ సిరీస్ ఎంతో కీలకంగా మారబోతుందని తెలుస్తుంది ఇకపోతే తాజాగా ఈ సిరీస్ గురించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.సమంత సిటాడిల్ సిరీస్ చేయడం కోసం కళ్ళు చెదిరిపోయే రెమ్యూనరేషన్ తీసుకున్నారు అంటూ ఒక వార్త బాలీవుడ్ ఇండస్ట్రీలో చెక్కర్లు కొడుతుంది.

సమంత ఒక సినిమా చేయాలి అంటే దాదాపు నాలుగు నుంచి ఐదు కోట్ల రూపాయల వరకు రెమ్యూనరేషన్ అందుకుంటారు.కానీ ఈ వెబ్ సిరీస్ చేయడం కోసం ఈమె ఏకంగా 10 కోట్ల రూపాయల వరకు రెమ్యూనరేషన్( Samantha Remuneration ) అందుకుంది అంటూ బాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక వార్త సంచలనంగా మారింది.ఇలా ఒక సిరీస్ కోసం సమంత పది కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకున్నారు అంటే ఈమెకు ఎలాంటి క్రేజ్ ఉందో స్పష్టంగా అర్థం అవుతుంది.

Advertisement

ఇలా ఒక సిరీస్ కు 10 కోట్ల రెమ్యూనరేషన్ అంటే మామూలు విషయం కాదు.మరి ఈ సిరీస్ కోసం సమంత తీసుకున్నటువంటి రెమ్యూనరేషన్ గురించి వస్తున్నటువంటి వార్తలలో ఎంతవరకు నిజం ఉందో లేదో తెలియదు కానీ ఈ వార్త మాత్రం వైరల్ గా మారింది.

ఇక ప్రస్తుతం సమంత తన ఆరోగ్యం( Samantha Health ) దృష్టిలో పెట్టుకొని ఏడాది పాటు సినిమాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే.ఇలా ఈమె ప్రస్తుతం ఎలాంటి సినిమాలకు కమిట్ అవ్వకుండా సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు