సర్జరీ వికటించి మృతి చెందిన టీవీ నటుడు ఎవరో తెలుసా?

ఆరోగ్యాన్ని కాపాడాల్సిన డాక్టర్ లే కొన్ని కొన్ని సార్లు పొరపాటు చేయటం వల్ల ప్రాణాలు కూడా పోయేలా చేస్తారు.

అలా తాము చేసిన వైద్య చికిత్సలు వికటించడంతో చాలా వరకు కొంతమంది పేషెంట్లు చనిపోయారు.

వాళ్లు సర్జరీ చేస్తున్న సమయంలో అందులో ఏదైనా సిజరింగ్ కి సంబంధించిన పరికరాలు శరీరంలో ఉండిపోవడంతో కూడా ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంటుంది.అలా వైద్యుల నిర్లక్ష్యం వల్ల లేదా పొరపాటు వల్ల పేషెంట్ల ప్రాణాలు పోయే పరిస్థితి వస్తుంది.

దాంతో నిర్లక్ష్యం చేసినందుకు వైద్యులపై ఎన్నో కేసులు కూడా అయ్యాయి.ఇదిలా ఉంటే సినీ ఇండస్ట్రీకి చెందిన ఓ నటుడు తనకు చేసిన సర్జరీ వికటించడంతో మృతిచెందాడు.

దీంతో అతని కుటుంబ సభ్యులు కూడా వైద్యులపై పోలీసు కేసు కూడా వేసారు.ఆ నటుడు ఎవరంటే.

Advertisement

బుల్లితెర నటుడు రాకేష్ దివాన్.ఈయన 2008 లో ప్రసారమైన రామాయణం సీరియల్ లో కుంభకర్ణుడి పాత్రలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

ఈయన చూడటానికి చాలా లావుగా ఉన్నందుకే అతడికి కుంభకర్ణుడు పాత్రను ఇచ్చారు.ఇక ఈయన ఇండస్ట్రీలో మరిన్ని అవకాశాలు అందుకోవడం కోసం తన బరువును తగ్గించుకోవాలని బాగా ప్రయత్నాలు చేశాడు.

దీంతో తాను బరువు తగ్గకపోయే సరికి బేరియాట్రిక్ శస్త్రచికిత్సను చేయించుకున్నాడు.ఇక డిశ్చార్జ్ అయి ఇంటికి వచ్చిన కొన్ని రోజుల తర్వాత తీవ్రమైన రక్తపోటు, మెదడు పనితీరు దెబ్బతినటంతో అతనిని మళ్లీ హాస్పిటల్ కి తీసుకెళ్లారు.ఇక ఆరోగ్య పరిస్థితి మరింత తీవ్రంగా మారటంతో మృతి చెందాడు.

దీంతో ఆసుపత్రి వర్గాల నిర్లక్ష్యం వల్లే అతడు మరణించాడు అని కుటుంబ సభ్యులు ఆరోపించారు.

అమ్మతోడు ఆస్తి కోసం కాదు.. మంచు మనోజ్ సంచలన వ్యాఖ్యలు నెట్టింట వైరల్!
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్11, శుక్రవారం 2025

అలా ఈయన ఏప్రిల్ 2014 లో మరణించాడు.రాకేష్ బాలీవుడ్ వెండితెరకు 2006లో పరిచయమయ్యాడు.తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

Advertisement

ఇక 2014 లో యా రాబ్ అనే సినిమాలో చివరిసారిగా నటించాడు.ఇక బుల్లితెరపై 2008 లో రామాయణం సీరియల్ తో అడుగు పెట్టి తన పాత్రలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

ఆ తర్వాత మరో మూడు సీరియల్స్ లో కూడా నటించాడు.ఇక మహాదేవ్ సీరియల్ లో కూడా తన పాత్రకు మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

ఇక ఇండస్ట్రీలో మరిన్ని అవకాశాలు అందుకోవడం కోసం తన శరీర బరువును తగ్గించుకోవడానికి ప్రయత్నించడంతో బేరియాట్రిక్ సర్జరీ వల్ల 2014 ఏప్రిల్ 27న మరణించాడు.

ఇక ఆయన మరణవార్త వినటంతో అందరూ షాక్ అయ్యారు.ఈయనే కాకుండా ఇండస్ట్రీకి చెందిన చాలామంది నటీనటులు తమ శరీర బరువును తగ్గించుకోవడం కోసం లేక తాము మరింత అందంగా తయారు కావడానికి ఫేస్ సర్జరీ చేసుకోవడం లాంటివి చేయించుకోవడానికి బాగా ఇష్టపడుతుంటారు.కానీ కొన్ని కొన్ని సార్లు అవి ప్రమాదానికి కూడా దారితీసే పరిస్థితులు వస్తుంటాయి.

ఇప్పటికే పలువురు సెలబ్రెటీలు వీటి వల్ల కొన్ని ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నారు.

తాజా వార్తలు