మధుమేహానికి ఒత్తిడికి ఉన్న సంబంధం గురించి తెలుసా..?

ఆధునిక జీవనశైలి కారణంగా వ్యాపించే వివిధ రకాల వ్యాధులలో డయాబెటిస్ కచ్చితంగా ఉంటుంది.

చెడు ఆహారపు అలవాట్లు, పని వేళలు, నిద్ర సరిగా లేకపోవడం, పని ఒత్తిడి( Stress ) ఇలా అన్ని మధుమేహం వ్యాధికి కారణం అవుతున్నాయని వైద్యులు చెబుతున్నారు.

వీటన్నింటితో పాటు మానసిక కారణాలు కూడా డయాబెటిస్ వ్యాధికి ప్రధాన కారణమని హెచ్చరిస్తున్నారు.నిద్ర సరిగ్గా లేక, పని ఒత్తిడి లేదా ఇతర కుటుంబ పరమైన సమస్యలు, ఇలా మానసికంగా పడే ఇబ్బందులు మధుమేహానికి దారి తీస్తున్నాయి.

మానసిక సమస్యల కారణంగా ఆందోళన,ఒత్తిడికి గురైనప్పుడు శరీరంలో చాలా హార్మోన్లు విడుదలవుతుంటాయి.ఈ హార్మోన్లు శరీరంలో బ్లడ్ షుగర్ లెవల్స్ ను అమాంతంగా పెరిగేలా చేస్తాయి.

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులలో ఇది ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది.శరీరంలో కనిపించే ప్రతిక్రియల్ని ఫ్లైట్ లేదా ఫ్లైట్ రెస్పాన్స్ అని పిలుస్తారు.

Advertisement

ఫలితంగా మీ రక్త సరఫరాలో అడ్రినలిన్, కార్టిసోల్ విడుదలవుతాయి.ఫలితంగా రెస్పిరేటరీ రేట్ పెరిగి రక్తం లోని చక్కెర స్థాయి కూడా పెరుగుతుంది.

ఒత్తిడి అనేది వివిధ రకాలుగా ప్రభావితం చేస్తుంది.టైప్2 డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు( Diabetes ) మానసిక ఒత్తిడికి లోనైనప్పుడు సహజంగానే బ్లడ్ షుగర్ స్థాయి పెరుగుతుంది. మానసిక ఒత్తిడి ఉన్నప్పుడు షుగర్ కూడా పెరగవచ్చు.

ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పుడు రక్తంలో షుగర్ లెవెల్స్ ను ట్రాక్ చేయాల్సి ఉంటుంది.ఇలా చేయడం ద్వారా మధుమేహం పరిస్థితి ఎప్పటికప్పుడు తెలుసుకునే వీలుంటుంది.

పని ఒత్తిడి కారణంగా సోమవారం వస్తే చాలు మందిలో ఒత్తిడి పెరిగిపోతుంది.ఒత్తిడికి లోనైనా ప్రతిసారి డయాబెటిస్ చెక్ చేసుకుంటే రెండిటికి ఉన్న సంబంధం ఏంటో తెలిసిపోతుంది.చాలా సందర్భాల్లో ఒత్తిడి లక్షణాలు సామాన్యంగానే ఉంటాయి.

మెకానిక్‌కి జాక్‌పాట్‌ .. రూ.25 కోట్ల లాటరీ తగలడంతో..
బాబోయ్, బిగ్‌బాస్ హౌస్‌ నిండా మెంటల్ కేసులే.. జుట్టు పీక్కుంటున్న ప్రేక్షకులు..

అది ఒత్తిడి అని కూడా మీకు అనిపించకపోవచ్చు.చాలామందిలో ఒత్తిడి లక్షణాలు విభిన్నంగా ఉంటాయి.

Advertisement

తలనొప్పి, కండరాల్లో నొప్పి( Headache ), ఎక్కువగా లేదా తక్కువగా నిద్రపోవడం, అనారోగ్యంగా ఉన్నట్లు అనిపించడం, అలసట, నీరసం, విసుగు, అశాంతి అనేది ఒత్తిడిలో కనిపించే ప్రధాన లక్షణాలు.

తాజా వార్తలు