పదవులు ఇస్తారా పైసలు ఇస్తారా ? బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కొత్త టెన్షన్

తెలంగాణలో సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో బిఆర్ఎస్( BRS ) ఎమ్మెల్యేలకు కొత్త చిక్కే వచ్చి పడింది.

మూడోసారి ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని పదేపదే అధినేత కేసిఆర్ ఎమ్మెల్యేలపై ఒత్తిడి చేస్తున్నారు.

నియోజకవర్గంలో ప్రజాబలం పెంచుకుని పార్టీ నాయకులందరినీ సమన్వయం చేసుకుంటూ తమ గ్రాఫ్ పెంచుకుంటేనే రాబోయే ఎన్నికల్లో టికెట్ ఇస్తామంటూ తేల్చి చెప్పేశారు.దీంతో పాటు అనేక సర్వేలు చేయిస్తూ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యేల పనితీరుపై విశ్లేషణ చేస్తున్నారు.

ఇక ఎన్నికలకు కొద్ది నెలలు మాత్రమే ఉండడంతో చోటామోటా నాయకులకు డిమాండ్ పెరిగింది.దీంతో సొంత పార్టీ క్యాడర్ ను కాపాడుకునేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అష్ట కష్టాలు పడుతున్నారు.

బిజెపి కాంగ్రెస్( Congress ) ల నుంచి గ్రామ, మండల ,నియోజకవర్గ స్థాయి నాయకులకు ఆహ్వానాలు అందుతూ ఉండడం, తమ పార్టీలో చేరితే పలానా పదవి ఇస్తామంటూ ఆఫర్ ఇస్తూ ఉండడం , మరికొంతమందికి డబ్బులు ఇస్తామంటూ ఆశ చూపిస్తూ ఉండడం వంటి కారణాలతో చాలామంది బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్, బిజెపి వైపు చూస్తూ ఉండడంతో సదరు నాయకులను కాపాడుకోవడం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఇబ్బందికరంగా మారింది.వచ్చే ఎన్నికల్లో మీ విజయానికి తాము కృషి చేస్తే తమకు పైసలు ఇస్తారా లేక నామినేటెడ్ పదవులు ఇస్తారా అంటూ ముందుగానే డిమాండ్ చేస్తూ ఉండడం వంటి ఘటనలు ఈ మధ్యకాలంలో చాలానే జరిగాయి.దీంతో వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం సదరు నాయకుల డిమాండ్లను తీరుస్తామని హామీ ఇస్తూ వారు పక్కచూపులు చూడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

Advertisement

వచ్చే ఎన్నికల్లో విజయం సాధించాలంటే కేడర్ ను కాపాడుకోవడం కోసం ఎంత సొమ్ములైన ఖర్చు పెట్టేందుకు బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలు సిద్ధమవుతున్నారట.తమ కోరికల చిట్టాను చాలామంది కేడర్ ఎమ్మెల్యేల( Cadre MLAs ) ముందు పెడుతుండడంతో,  వారి కోరికలను తీర్చడం తప్ప మరో ఆప్షన్ వీరికి కనిపించడం లేదట.

ప్రస్తుతం అధికార పార్టీ బీఆర్ఎస్ కేడర్ ను కాపాడుకోవడం పెద్ద సవాల్ గా మారింది.ఎన్నికల లో కష్టపడి తాము పనిచేసినా, ఎన్నికల అనంతరం తమను సరిగా పట్టించుకోవడంలేదని, అందుకే ముందుగానే తమ డిమాండ్లను వినిపిస్తున్నామని కొంతమంది లీడర్లు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు .ప్రస్తుతం ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో, తమ అవసరాలు తీర్చడం మినహా మరో ఆప్షన్ ఎమ్మెల్యేలకు ఉండదనే ఈ విధంగా వ్యవహరిస్తున్నారట.స్థాయిని బట్టి ఐదు నుంచి పది లక్షల వరకు నాయకులు డిమాండ్ చేస్తున్నారట.

కొంతమంది నామినేటెడ్ పదవులు విషయంలో స్పష్టమైన హామీ తీసుకుంటున్నారట.ఈ వ్యవహారాలన్ని బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు పెద్ద తలనొప్పిగా మారిందట.

తల్లికి 15 లక్షల విలువ చేసే జ్యూవెలరీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్.. ఈ కొడుకు గ్రేట్ అంటూ?
Advertisement

తాజా వార్తలు