న్యాచురల్ గా షైనీ హెయిర్ ను పొందాలనుకుంటే ఇలా చేయండి!

సాధారణంగా కొందరు తమ జట్టు షైనీగా( Shiny Hair ) మెరిసిపోతూ కనిపించాలని కోరుకుంటారు.ఇందుకోసం ఎంతో ఖరీదైన షాంపూ, కండీషనర్స్ ను వాడుతుంటారు.

అయినప్పటికీ కోరుకున్న ఫలితాలు దక్కకపోవచ్చు.పోషకాల కొరత, కాలుష్యం, ఎండల ప్రభావం తదితర కారణాల వల్ల జుట్టు ఆరోగ్యం పాడవుతుంది.

హెయిర్ ఫాల్, హెయిర్ డ్యామేజ్ వంటి సమస్యలు ఇబ్బంది పెడుతుంటాయి.అయితే వీటన్నిటికీ చెక్ పెట్టి న్యాచురల్ గా హెయిర్ ను సూపర్ షైనీ గా మెరిపించడంలో ఇప్పుడు చెప్పబోయే హోమ్ రెమెడీ చాలా అద్భుతంగా సహాయపడుతుంది.

అందుకోసం ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో వన్ టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్( Coffee Powder ) వేసుకోవాలి.అలాగే వన్ టేబుల్ స్పూన్ షుగర్,( Sugar ) రెండు టేబుల్ స్పూన్లు లెమన్ జ్యూస్,( Lemon Juice ) వన్ టీ స్పూన్ విటమిన్ ఈ ఆయిల్ మరియు రెండు టేబుల్ స్పూన్లు రెగ్యులర్ షాంపూ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.

Advertisement
Do This If You Want To Get Shiny Hair Naturally Details, Shiny Hair, Hair Care,

ఆ తర్వాత అందులో ఒక గ్లాసు గోరువెచ్చని వాటర్ పోసి మరోసారి కలుపుకోవాలి.ఇప్పుడు ఈ వాటర్ ను ఉపయోగించి హెయిర్ వాష్ చేసుకోవాలి.

వారానికి ఒకసారి ఈ విధంగా షాంపూ చేసుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు పొందుతారు.

Do This If You Want To Get Shiny Hair Naturally Details, Shiny Hair, Hair Care,

కాఫీలోని కెఫిన్( Caffeine ) జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది, జుట్టు రాలడాన్ని ఆపుతుంది.మరియు కురులను షైనీగా మెరిపించడానికి కూడా కాఫీ పౌడర్ తోడ్పడుతుంది.షుగర్ స్కాల్ప్ నుండి డెడ్ స్కిన్ సెల్స్ మరియు మురికిని తొలగిస్తుంది.

షుగర్ జుట్టుకు మంచి తేమతో పాటు కొత్త మెరుపును కూడా జోడిస్తుంది.నిమ్మరసంలోని యాంటీ బాక్టీరియల్ మరియు యాంటీ ఫంగల్ లక్షణాలు చుండ్రుకు కారణమయ్యే ఫంగస్‌తో పోరాడుతాయి.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఫిబ్రవరి27, గురువారం 2025
ఆ మూవీ సెట్స్ లో అందరికీ టార్చర్ చూపించాను.. థమన్ క్రేజీ కామెంట్స్ వైరల్!

చుండ్రును సమర్థవంతంగా దూరం చేస్తాయి.

Advertisement

నిమ్మరసంలో విటమిన్ సి ఉంటుంది, ఇది జుట్టు కుదుళ్లను బలపరిచే కొల్లాజెన్‌ను ఉత్పత్తి చేస్తుంది.ఇక విటమిన్ ఈ ఆయిల్ జుట్టు రాలడాన్ని విరగడాన్ని అడ్డుకుంటుంది.హెయిర్ గ్రోత్ ను ప్రోత్సహిస్తుంది.

విటమిన్ ఇ ఆయిల్ జుట్టుకు షైన్ ను కూడా జోడిస్తుంది.కాబట్టి ఆరోగ్యమైన మెరిసే కురులను కోరుకునేవారు తప్పకుండా పైన చెప్పిన విధంగా షాంపూ చేసుకునేందుకు ప్రయత్నించండి.

తాజా వార్తలు