గొంతు నొప్పి.( Throat Pain ) ప్రస్తుత చలికాలంలో( Winter ) అత్యంత సర్వసాధారణంగా ఇబ్బంది పెట్టే సమస్యల్లో ఒకటి.
బాక్టీరియా, వైరస్, అలర్జీలు, ధూమపానం, వాతావరణ కాలుష్యం, ఆల్కహాల్ తదితర కారణాల వల్ల గొంతు నొప్పి ఇబ్బంది పెడుతుంటుంది.ఇది చిన్న సమస్యే అయినప్పటికీ తీవ్రమైన నొప్పికి మరియు అసౌకర్యానికి గురిచేస్తుంది.
ఒక్కోసారి గొంతు నొప్పి కారణంగా తినడం, తాగడమే కాదు మాట్లాడడం కూడా కష్టతరమవుతుంది.ఈ క్రమంలోనే రిలీఫ్ కోసం పెయిన్ కిల్లర్స్ వేసుకుంటారు.
కానీ సాధారణ గొంతు నొప్పికి మందులతో అవసరం లేకుండా ఇంట్లోనే ఈజీగా సహజ పద్ధతిలో చెక్ పెట్టవచ్చు.

అందుకోసం ముందుగా అర అంగుళం అల్లం ముక్కని( Ginger ) తీసుకుని శుభ్రంగా పొట్టు తొలగించి సన్నగా తురుముకోవాలి.ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి.వాటర్ హీట్ అయ్యాక పావు టీ స్పూన్ ఆర్గానిక్ పసుపు( Turmeric ) వేసుకోవాలి.
అలాగే వన్ టీ స్పూన్ ఫ్రెష్ అల్లం తురుము మరియు ఐదు నుంచి ఆరు తులసి ఆకులు( Tulsi Leaves ) వేసి పది నిమిషాల పాటు మరిగించాలి.ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని స్ట్రైనర్ సహాయంతో వాటర్ ను ఫిల్టర్ చేసుకోవాలి.
గోరువెచ్చగా ఉన్నప్పుడు ఈ వాటర్ ను సేవించాలి.

గొంతు నొప్పి వేధిస్తోందని బాధపడుతున్న వారికి ఈ డ్రింక్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.రోజుకు రెండు సార్లు ఈ డ్రింక్ ను కనుక తీసుకుంటే గొంతు నొప్పి పరార్ అవుతుంది.అలాగే ఈ డ్రింక్ లో ఉండే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్స్ ఇమ్యూనిటీ పవర్ ను పెంచుతాయి.
జలుబు, దగ్గు వంటి సమస్యలను దూరం చేస్తాయి.బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్న వారు కూడా ఈ డ్రింక్ ను తమ రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవచ్చు.
ఎందుకంటే ఈ డ్రింక్ జీవక్రియ రేటును పెంచుతుంది.కేలరీలు కరిగే ప్రక్రియను వేగవంతం చేస్తుంది.
ఫలితంగా వెయిట్ లాస్ అవుతారు.