ప్రస్తుత రోజులలో సోషల్ మీడియా వినియోగం సర్వసాధారణం అయిపోయింది.ఈ క్రమంలో నిత్యం సోషల్ మీడియాలో ప్రముఖ షార్ట్ వీడియో యాప్స్ రోజు ఒక్కొకటి కొత్త కొత్తవి పుట్టుక వస్తున్నాయి.
ఈ క్రమంలో ప్రముఖ షార్ట్ వీడియో యాప్ అయినా టిక్ టాక్( TikTok ) అమెరికాలో( America ) తన సేవలను నిలిపే వేస్తున్నట్లు ఒక కీలక ప్రకటన చేసింది.ఈ మేరకు ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లకు నేటి నుంచి టిక్ టాక్ సేవలను మూసివేస్తున్నట్లు సందేశం రూపంలో అందరికీ తెలియజేసింది.
టిక్ టాక్ పై నిషేధం అమల్లోకి రానున్న సమయంలో కంపెనీ మాతృ సంస్థ బైట్ డ్యాన్స్ కి( Byte Dance ) నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

అంతేకాకుండా, టిక్ టాక్ తన యూజర్ల కోసం అమెరికాలో టిక్ టాక్ ను నిషేధించేందుకు తీసుకొని వచ్చిన చట్టం జనవరి 19 నుంచి అమల్లోకి వస్తుంది.దీంతో ఈ సేవలు అన్ని తాత్కాలికంగా నిలిపివేతున్నట్లు యూజర్లకు సందేశం తెలియజేసింది.మరొకవైపు 2017లో టిక్ టాక్ సేవలు ప్రారంభమై మన ఇండియాతో పాటు అనేక దేశాలలో టిక్ టాక్ ను నిషేధించాయి.
అమెరికాలోని చాలా రాష్ట్రాలలో టిక్ టాక్ వినియోగం పై ఆంక్షలు పెట్టాయి.ఈ క్రమంలో ఇటీవల అమెరికా ప్రతినిధుల సభ ఒక బిల్లు ఆమోదం తెలిపింది.

చైనా( China ) యాజమాన్యాన్ని వదులుకోకపోతే నిషేధం ఎదుర్కోవాల్సిందే అంటూ బిల్లులో తెలియచేసింది.అనంతరం అమెరికా సుప్రీంకోర్టు కూడా టిక్ టాక్ మాతృ సంత ఆయన బైట్ డ్యాన్స్‌కు ఒక డెడ్లైన్ ఇచ్చింది.జనవరి 19లోగా యూఎస్ టిక్‌టాక్ ను విక్రయిస్తారా లేదా నిషేధాన్ని కి సమ్మతిస్తారా ఏదైనా నిర్ణయం తీసుకోవాలని హెచ్చరికలు జారీ చేసింది.ఈ క్రమంలో టిక్ టాక్ సేవలను ఆపివేస్తున్నట్లు ఆ సంస్థ యూజర్లకు సమాచారం రూపంలో అందజేసింది.
ఇక మరొక వైపు ట్రంప్( Trump ) అధికారంలోకి వచ్చాక ఈ టిక్ టాక్ సేవలను పునరుద్ధరణకు ప్రయత్నించేందుకు చర్చలు జరుపుతామని సంస్థ తెలియజేసినట్లు సమాచారం.