మొటిమలు.( Acne ) చాలా మందిని చాలా కామన్ గా కలవర పెట్టే చర్మ సమస్యల్లో ఒకటి.యుక్త వయసు నుంచి ప్రారంభమయ్యే మొటిమల బెడద.చాలా ఏళ్లు కంటిన్యూ అవుతాయి.కొందరు మొటిమల కారణంగా తీవ్రమైన ఒత్తిడికి గురవుతుంటారు.అద్దంలో ముఖాన్ని చూసుకోవడానికి కూడా ఇష్టపడరు.
మీరు ఈ జాబితాలో ఉన్నారా.? అయితే ఇకపై అస్సలు వర్రీ అవ్వకండి.మొటిమలకు గుడ్ బై చెప్పాలనుకుంటే ఇప్పుడు చెప్పబోయే హోమ్ రెమెడీని ఫాలో అవ్వండి.

అందుకోసం ముందుగా మిక్సీ జార్ తీసుకుని అందులో నాలుగు టమాటో స్లైసెస్( Tomato Slices ) మరియు రెండు టేబుల్ స్పూన్లు పెరుగు( Curd ) వేసి స్మూత్ గా గ్రైండ్ చేసుకోవాలి.ఆ తర్వాత ఒక బౌల్ తీసుకుని అందులో వన్ టేబుల్ స్పూన్ బియ్యం పిండి,( Rice Flour ) వన్ టేబుల్ స్పూన్ శనగపిండి, పావు టీ స్పూన్ ఆర్గానిక్ పసుపు వేసుకోవాలి.అలాగే హాఫ్ టీ స్పూన్ కోకోనట్ ఆయిల్( Coconut Oil ) మరియు గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటో ప్యూరీ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.
ఈ మిశ్రమాన్ని ముఖానికి మేడకు అప్లై చేసుకుని 15 నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.ఆపై వాటర్ తో శుభ్రంగా చర్మాన్ని క్లీన్ చేసుకోవాలి.

వారానికి ఒకటి లేదా రెండు సార్లు ఈ సింపుల్ రెమెడీని కనుక పాటించారంటే అదిరిపోయే బెనిఫిట్స్ మీ సొంతం అవుతాయి.ముఖ్యంగా ఈ రెమెడీ చర్మాన్ని క్లెన్సింగ్ చేస్తుంది.చర్మ కణాల్లో పేరుకుపోయిన మురికి, మృతకణాలను తొలగిస్తుంది.మొటిమల సమస్యకు అడ్డుకట్ట వేస్తుంది.అలాగే ఈ రెమెడీని ఫాలో అవ్వడం వల్ల చర్మం పై ఉన్న మొండి మచ్చలు మెల్ల మెల్లగా మాయం అవుతాయి.స్కిన్ కలర్ ఈవెన్ గా మారుతుంది.
అందంగా కాంతివంతంగా మెరుస్తుంది.కాబట్టి మెటిమల్లేని మెరిసే చర్మాన్ని కోరుకునేవారు తప్పకుండా ఇప్పుడు చెప్పుకున్న రెమెడీని ప్రయత్నించండి.