దయచేసి పెద్ద సినిమాలను ఆరోజు విడుదల చేయొద్దు: సోహెల్

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో రీ రిలీజ్ సినిమాల హవా కొనసాగుతున్న విషయం మనకు తెలిసిందే.అయితే ఈ సినిమాలన్నింటిని కూడా వీకెండ్ లో విడుదల చేస్తున్నారు.

ఇలా స్టార్ హీరోల సినిమాలన్నీ కూడా వీకెండ్ లో విడుదల కానున్న నేపథ్యంలో అభిమానుల సైతం ఈ రిలీజ్ సినిమాలను చూడటానికే పెద్ద ఎత్తున ఆసక్తి కనబరుస్తున్నారు.ఈ క్రమంలోనే ఈ ప్రభావం చిన్న సినిమాలపై పడుతోందని తాజాగా బిగ్ బాస్(Bigg Boss) కంటెస్టెంట్ నటుడు సోహెల్(Sohel) వెల్లడించారు.

తాజాగా ఈయన మిస్టర్ ప్రెగ్నెంట్(Mr.Pregnant) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

ఈ సినిమా ఆగస్టు 18వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.అయితే ఈ సినిమా కార్యక్రమాలలో భాగంగా సోహెల్ మాట్లాడుతూ పెద్ద సినిమాలను రీ రిలీజ్ చేస్తున్నటువంటి నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్లను రిక్వెస్ట్ చేస్తూ దయచేసి పెద్ద సినిమాలను వీకెండ్ లో రీ రిలీజ్ చేయవద్దని కోరారు.ఈ సినిమాలను శుక్రవారం కంటే ముందుగానే విడుదల చేసి కొత్త చిన్న సినిమాలను కాపాడాలని ఈయన కోరారు.

Advertisement

ప్రేక్షకులు మంచి సినిమాలను ఎప్పుడూ ఆదరిస్తారని ఫ్యాషన్ తో మేము కొత్త సినిమాలను చేస్తున్నాము.అయితే వీకెండ్ లో ఇలా స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ అవుతున్నటువంటి నేపథ్యంలో చిన్న సినిమాలు ఆదరణ కోల్పోతున్నాయని,అందుకే పెద్ద సినిమాల రీ రిలీజ్( Re-Release Movies ) వీకెండ్ లో కాకుండా వీక్ డేస్ లో రిలీజ్ చేయాలంటూ ఈ సందర్భంగా ఈయన డిస్ట్రిబ్యూటర్లను నిర్మాతలను అభ్యర్థిస్తూ చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

పాకిస్థాన్ ఆర్మీ దారుణం.. మోదీని పొగిడిన యూట్యూబర్లను ఉరేసి చంపేసింది?
Advertisement

తాజా వార్తలు