ఆర్ధిక సమస్యలతో సతమతం అవుతున్నారా.. అయితే ఇవి పాటించండి!

జీవితంలో డబ్బు ఒక్కటే ముఖ్యం కాదని చాలామంది అంటారు.

కానీ మన జీవితంలో ఏర్పడే సమస్యలు, ఆందోళనలు, ఇబ్బందులు ఇవన్నీ కూడా డబ్బుతోనే ముడిపడి ఉన్నాయి అని అనడంలో అతిశయోక్తి లేదు.

మన దగ్గర డబ్బులు లేకపోతే మన అనుకున్న వాళ్లు కూడా దూరం అవుతారు.ఇలాంటి సమస్యలతో మీరు బాధపడుతున్నట్లయితే శుక్రవారం రోజున సాక్షాత్తు ఆ మహాలక్ష్మి దేవికి సమర్పించడం ద్వారా మన సమస్యలు ఆందోళనలు దూరమవుతాయి.

Friday Pooja, Laxmi Pooja, Financial Problems, Money And Prosperity-ఆర్ధ

మరి శుక్రవారం రోజున అమ్మవారికి ఏవి సమర్పించాలో ఇక్కడ తెలుసుకుందాం.మీరు సమస్యలతో బాధపడుతున్నట్లైతే లేదా ఆందోళనలు కలిగి ఉంటే, శుక్రవారం రోజున శ్రీ మహాలక్ష్మి దేవికి శంకువు, చక్రం, ఎర్రని తామరపువ్వు సమర్పించడం ద్వారా మీ సమస్యలు తీరి పోవడంతో పాటు, మానసికంగా ఉత్సాహంగా ఉంటారు.

మీరు అనుకున్న పనులు నెరవేరకపోతే లేదా ప్రతిసారి ఆటంకం కలుగుతూ ఉంటే అమ్మవారికి తామర పువ్వును సమర్పించి, నల్ల చీమలకు చక్కెర వేయడం ద్వారా మనం అనుకున్న పనులు నెరవేరుతాయి.మీరు ఏదైనా ముఖ్యమైన పని మీద బయటకు వెళ్తున్నప్పుడు కొద్దిగా చక్కెర కలిపిన పెరుగును తీసుకోవడం ద్వారా అనుకున్న పనులు నిర్విఘ్నంగా పూర్తి అవుతాయి.

Advertisement

చాలామంది తమ ఇళ్లలో ఆహారాన్ని వృధా గా పడేస్తూ ఉంటారు.అలా చేయడం వల్ల ఆ ఇంట్లో ఆర్థిక సమస్యలను ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది.

కోపంతో అన్నాన్ని విసిరి కొట్టడం, పారేయటం వంటి పనులు అసలు చేయకూడదు.ఇలా చేయడం ద్వారా ఇంట్లో ఆర్థిక సమస్యలు ఎదుర్కోవడమే కాకుండా, ఆ ఇంట్లో సుఖ సంతోషాలు కరువు అవుతాయి.

శుక్రవారం అమ్మ వారికి ఎంతో ఇష్టమైన రోజు.ఆ రోజున అమ్మవారికి ఎర్రని పువ్వులతో పూజ చేయడం ద్వారా అమ్మవారి అనుగ్రహం కలిగి అనుకున్న పనులు నెరవేరుతాయి.

శుక్రవారం అమ్మవారిని పూజించి వారు ఎర్రని లేదా గులాబీ రంగు దుస్తులు ధరించాలి.అలాగే మహిళలు ఎరుపు రంగు పువ్వులను పెట్టుకోవడం ద్వారా దీర్ఘ సుమంగళీ ప్రాప్తం కలుగుతుంది.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఆగష్టు 16, సోమవారం, 2021
Advertisement

తాజా వార్తలు