డీకే కు ఢిల్లీ పిలుపు ! తెలంగాణ పై తేల్చేస్తున్నారా ? 

తెలంగాణ ముఖ్యమంత్రిగా ఎవరిని ఎంపిక చేయాలనే విషయంలో కాంగ్రెస్ అధిష్టానం పెద్దలు తీవ్రంగానే కసరత్తు చేస్తున్నారు.

రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని మెజారిటీ కాంగ్రెస్ నాయకులు భావిస్తుండగా , మిగతా కాంగ్రెస్ సీనియర్ నాయకులు తాము ముఖ్యమంత్రి రేసులో ఉన్నామంటూ ప్రకటనలు చేయడంతో పాటు,  ఢిల్లీకి వెళ్లి అధిష్టానం పెద్దలపై ఒత్తిడి చేస్తున్నారు.

ఈ క్రమంలో ఆ పదవి ఎవరిని వరించబోతుందనేది ఆసక్తికరంగా మారింది.ముఖ్యమంత్రి పదవితో పాటు , మంత్రివర్గ విస్తరణ పైన ఢిల్లీ అధిష్టానం పెద్దలు పార్టీ కీలక నాయకులతో చర్చిస్తున్నారు.

ఈరోజు సాయంత్రం లోగా ముఖ్యమంత్రి ఎవరు అనేది కాంగ్రెస్ పెద్దలు ప్రకటించబోతున్నారు.ఇప్పటికే మల్లు భట్టి విక్రమార్క,  ఉత్తమ్ కుమార్ రెడ్డిలు ఢిల్లీకి వెళ్లి అధిష్టానం పెద్దల వద్ద తమ ప్రతిపాదనలను పెట్టారు.

కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ ను కాంగ్రెస్ అధిష్టానం పెద్దలు ఢిల్లీకి రావలసిందిగా పిలుపునిచ్చారు.  మల్లికార్జున ఖర్గే నివాసంలో తెలంగాణ ముఖ్యమంత్రి ఎవరు అనే అంశం పైన కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ , కేసీ వేణుగోపాల్ సమక్షంలో చర్చించనున్నారు .తెలంగాణ ఎన్నికల ముఖ్య పరిశీలకుడిగా డీకే శివకుమార్ , తెలంగాణ పార్టీ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యరావు టాక్రే తదితరులు మల్లికార్జున్ ఖర్గే నివాసానికి వెళ్లారు.హైదరాబాద్ నుంచి తీసుకువచ్చిన ఎమ్మెల్యేల అభిప్రాయాలతో పాటు,  ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్కలతో జరిగిన సమావేశాలు వివరాలపై డీకే శివకుమార్ మల్లికార్జున ఖర్గే కు నివేదిక అందించారు.

Advertisement

సీఎం ఎంపికపై ఖర్గే నివాసానికి వెళ్లే ముందు డీకే శివకుమార్ మీడియాతో మాట్లాడుతూ కొన్ని వివరాలను ప్రకటించారు .తెలంగాణ సీఎల్పీ నేతను హై కమాండ్ నిర్ణయిస్తుంది .ఫైనల్ గా హై కమాండ్ సరైన నిర్ణయం తీసుకుంటుంది అంటూ మాట్లాడారు.ఇక సీఎం పదవి ఆశిస్తున్న భట్టి విక్రమార్క,  ఉత్తంకుమార్ రెడ్డిలతో డీకే శివకుమార్ , మాణిక్ రావు టాక్రే లు విడివిడిగా సమావేశం అయ్యారు.

ఈ సందర్భంగా వారిద్దరి అభిప్రాయాలను తీసుకున్నారు.ఈరోజు సాయంత్రానికి ముఖ్యమంత్రి ఎవరు అనేది ప్రకటించేందుకు కాంగ్రెస్ అధిష్టానం కసరత్తు చేస్తోంది.

Advertisement

తాజా వార్తలు