ఆటో డ్రైవర్ సీట్ పక్కన దివి.. నువ్వు ఆ బ్యాచ్ వే అంటూ ట్రోల్స్?

ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీలలో తమకు ఎవరైనా నచ్చితే వారికి మంచి కాంప్లిమెంట్, సలహాలు ఇస్తూ ఉంటారు నెటిజన్స్.

అలా కాకుండా వారికి నచ్చని వాళ్ళు ఉంటే మాత్రం వాళ్ళు ఏ పని చేసినా ట్రోల్స్ చేస్తూ ఉంటారు.

ఎందుకంటే అది వాళ్ళ ప్రవర్తన పై ఆధారపడి ఉంటుంది కాబట్టి.అయితే బిగ్ బాస్ బ్యూటీ దివి కూడా అదే పరిస్థితి.

ఆమె ఏం చేసినా కూడా వెంటనే ట్రోల్స్ చేస్తూ ఉంటారు నెటిజన్స్.అయితే తాజాగా ఆమె మరో ట్రోల్ ఎదుర్కొంది.

ఇంతకు అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం.బిగ్ బాస్ షో ద్వారా అందరి కంటిలో పడిన బ్యూటీ దివి.

Advertisement

అలా అప్పటినుంచి ఈ బ్యూటీ ఏదో ఒక విధంగా తన పరిచయాన్ని పెంచుకుంటూ వచ్చింది.అలా వెండితెరపై అవకాశాలు కూడా అందుకుంది.

సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటూ అక్కడ కూడా మంచి అభిమానం సంపాదించుకుంది.తొలిసారిగా ఈ బ్యూటీ వెండితెరపై పలు సినిమాలలో సైడ్ ఆర్టిస్ట్ గా నటించగా ఆ తర్వాత బిగ్ బాస్ సీజన్ 4 లో కంటెస్టెంట్ గా పాల్గొని తన అందంతో యువత మనసులు దోచుకుంది.

అలా హౌస్ లో ఉన్నంతకాలం తన గేమ్ తో, మాటలతో అందర్నీ ఫిదా చేసింది.ఇక ఈ షోతోనే ఎనలేని క్రేజ్ సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ.బిగ్ బాస్ తర్వాత అంతంతగా మాత్రమే అవకాశాలు అందుకుంది.

పలు వెబ్ సిరీస్ లలో కూడా నటించి మంచి సక్సెస్ అందుకుంది.సోషల్ మీడియాలో మాత్రం నిత్యం యాక్టివ్ గా ఉంటూ తన ఫోటోలతో బాగా రచ్చ చేస్తుంది.

వైరల్ వీడియో : ఇలాంటి వికృతానందం సరి కాదంటూ హెచ్చరిక చేసిన ఆర్టీసీ ఎండీ సజ్జనార్..
టాలీవుడ్ స్టార్స్ కు మోక్షజ్ఞ గట్టి పోటీ ఇస్తారా.. అలా జరిగితే మోక్షజ్ఞకు తిరుగులేదంటూ?

తన అందంతో మాత్రం అందర్నీ చూపు తిప్పుకోకుండా చేసింది.పైగా మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ గా కూడా నిలిచి అందరి దృష్టిలో పడింది.

Advertisement

గతంలో ఈమెకు టాలీవుడ్ సినీ దర్శక నిర్మాతలు పలు అవకాశాలు కూడా ఇచ్చారు.ఇక ఓ ప్రైవేట్ స్పెషల్ సాంగ్ లో చేయగా తన డాన్స్ స్టెప్పులతో బాగా ఆకట్టుకుంది.ఇక ఇప్పుడు అవకాశాలు అందుకోవడం లేదు.

చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ లో అవకాశం అందుకోగా ఈ సినిమాలో తన పాత్ర అంతగా ఆకట్టుకోలేకపోయింది.మొదట్లో ట్రెడిషనల్ గా కనిపించిన ఈ బ్యూటీ ఈ మధ్య తన గ్లామర్ ను కూడా పరిచయం చేసింది.

పొట్టి పొట్టి బట్టలతో హాట్ లుక్ లతో బాగా రెచ్చిపోతుంది.

అయితే ఇదంతా పక్కన పెడితే తాజాగా ఆమె.తన ఇన్ స్టా లో ఒక స్టోరీ పంచుకుంది.అందులో తను ఆటోలో డ్రైవర్ పక్కన సీట్లో కూర్చొని ఫోటోకి ఫోజ్ ఇచ్చింది.

అంతేకాకుండా ఆ ఫోటోకు.సింగిల్స్ కు మాత్రమే అందులోకి ఎంట్రీ అని చెప్పుకొచ్చింది.

దీంతో వెంటనే నెటిజన్స్ ఆ ఫోటోపై ట్రోల్స్ చేయడం మొదలుపెట్టారు.అంటే దీని ఉద్దేశం.

నీ దగ్గరికి సింగిల్స్ మాత్రమే రావాలా అంటూ కామెంట్ చేయగా.మరికొంతమంది.

మాకు ముందే తెలుసు నువ్వు ఎప్పుడైనా ఆటో డ్రైవర్ కి పడతావు అని.నువ్వు ఆ బ్యాచ్ కే చెందినామెవు అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

తాజా వార్తలు