మానాల గ్రామ ప్రజలకు ఎన్నికలపై అవగాహన కల్పించిన జిల్లా ఎస్పీ..

రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి పోలీస్ స్టేషన్ పరిధిలోని క్రిటికల్ ,నార్మల్ పోలింగ్ కేంద్రాలు,మానాల చెక్ పోస్ట్ను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్.

గురువారం మానాల గ్రామ ప్రజలకు, యువకులకు జిల్లా ఎస్పీ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా తీసుకోవలసిన చర్యలపై అవగాహన కల్పించారు.

అనంతరం రుద్రంగి పోలీస్ స్టేషన్ పరిధిలోని క్రిటికల్ ,నర్మల్ పోలింగ్ కేంద్రాలు,మానాల చెక్ పోస్ట్ తనిఖీ చేసి అధికారులకు పలు సూచనలు చేశారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా ,ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రజలు తమయెక్క ఓటు ప్రశాంత వాతవరంలో వినియెగించుకోవాలని,ఎన్నికల సందర్భంగా ప్రజలు యువకుల రెచ్చగొట్టే మాటలతో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకొని కేసులు నమోదు చేయడం జరుగుతుందని తద్వారా భవిష్యత్తులో పోలీస్ వేరిఫికేషన్ సమయంలో ఇబ్బందులు తలెత్తుతాయని అన్నారు.

పోలింగ్ కేంద్రాల వద్ద సమస్యలు తలెత్తకుండా నిర్ణిత సమయం కన్నా ముందే పోలింగ్ కేంద్రాలు చేరుకొని ఓటు వినియెగించుకొని సహకరించాలని సూచించారు.అనంతరం రుద్రంగి పోలీస్ స్టేషన్ పరిధిలోని క్రిటికల్ ,నర్మల్ పోలింగ్ కేంద్రాలు తనిఖీ చేసి సీసీ కెమెరాల ఏర్పాటు,ఎన్నికల సజావుగా జరిగేలా కట్టుదిట్టమైన ఏర్పాట్లు , అవసరమైన వసతులు కల్పించాలని అధికారులకు సూచించారు.

క్రిటికల్ పోలింగ్ కేంద్రాల వద్ద ప్రజలు ధైర్యంగా ఓటు హక్కు వినియోగించుకునేల ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగిదన్నారు.మానాల క్రాస్ రోడ్ వద్ద ఏర్పాటు చేసిన స్టాటిక్ సర్వేలెన్సు టీం ఆధ్వర్యంలో గల చెక్ పోస్ట్ ను తనిఖీ చేశారు, విధుల్లో ఉన్న సిబ్బందికి పలు సూచనలు చేశారు.

Advertisement

వాహన తనిఖీల్లో అప్రమత్తంగా ఉండాలన్నారు, ఎట్టి పరిస్థితుల్లో ఏ వాహనాన్ని విడిచిపెట్టకుండా ప్రతీ వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తూ అక్రమ మద్యం ,నగదు, ప్రజలను ప్రలోబపరిచే వస్తువుల రవాణాకు ఆడ్డుకట్ట వేయాలని అన్నారు.ప్రజలకు విజ్ఞప్తి ప్రయాణ సమయంలో యాబై వేళా కంటే ఎక్కువ నగదు వెంట తీసుకపోవద్దు అని,ఒకవేళ తీసుక వెళ్తే వాటికి సబందించిన పత్రాలు వెంట వుండాలని అన్నారు.

ఎస్పీ వెంట , సి.ఐ వెంకటేశ్వర్లు, ఎస్.ఐ అశోక్ సిబ్బంది ఉన్నారు.

Advertisement

Latest Rajanna Sircilla News