ప్రజావాణికి 126 దరఖాస్తుల రాక-స్వీకరించిన జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

రాజన్న సిరిసిల్ల జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి దరఖాస్తులు వచ్చాయి.

ఈ సందర్భంగా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, అదనపు కలెక్టర్ ఖిమ్యా నాయక్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు.

ఆయా దరఖాస్తులు సకాలంలో పరిష్కరించాలని ఆదేశించారు.ఆయా శాఖలకు వచ్చిన అర్జీలు.

రెవెన్యూ శాఖకు 58, సిరిసిల్ల మున్సిపల్ కమిషనర్ కు 11, ఎస్ డీ సీ కి 8, ఉపాధి కల్పన శాఖకు 7, ఎంపీడీవో తంగళ్లపల్లికి 6, ఎంపీడీవో బోయినపల్లి, డీఆర్డీఓ, సెస్ కు నాలుగు చొప్పున, విద్యాశాఖకు 3, జిల్లా పంచాయతీ అధికారి, డీఎస్ సీడీఓ, జిల్లా వ్యవసాయ అధికారి, ఎంపీడీవో ముస్తాబాద్ కు రెండు చొప్పున, మున్సిపల్ కమిషనర్ వేములవాడ, ఎస్పీ ఆఫీస్, మైన్స్, నీటి పారుదల శాఖ, ఎంపీడీవో కోనరావుపేట, రుద్రంగి, ఎల్లారెడ్డిపేట, ఎల్ డీఎం, జడ్పీ సీఈవో, డీసీఎస్ఓ, జిల్లా వైద్యాధికారి, డీపీఆర్ఈ, హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్స్ ఒకటి చొప్పున వచ్చాయన్నారు.ఆయా శాఖల ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు.

బొప్పాపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ సాధారణ సమావేశం
Advertisement

Latest Rajanna Sircilla News