పోలింగ్ సమయం గంట పాటు పొడిగింపు:జిల్లా కలెక్టర్ హనుమంత్ కే.జెడంగే

యాదాద్రి భువనగిరి జిల్లా:ఈనెల 13వ తేదీన జరిగే సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సమయం ఒక గంట పొడిగించడం జరిగిందని భువనగిరి పార్లమెంట్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి,జిల్లా కలెక్టర్ హనుమంతు కె.జెడంగే ఒక ప్రకటనలో తెలిపారు.

భువనగిరి పార్లమెంటు పరిధిలోని అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో పోలింగ్ సమయాన్ని ఉదయం 7.00 గంటల నుండి సాయంత్రం 6.00 గంటల వరకు పొడిగించడం జరిగిందని,ప్రజలందరూ తమ ఓటు హక్కును స్వేచ్చగా వినియోగించుకోవాలని కోరారు.

Latest Video Uploads News