ఏపీ హైకోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ కొట్టివేత

టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏపీ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.

స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో అరెస్ట్ అయిన చంద్రబాబు తనపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో చంద్రబాబు తరపు న్యాయవాదులు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం పిటిషన్ ను కొట్టివేసింది.అయితే చంద్రబాబు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే.

మరోవైపు మరికాసేపటిలో విజయవాడ ఏసీబీ కోర్టులో చంద్రబాబు కస్టడీ పిటిషన్ పై తీర్పు వెలువడనుంది.

హెచ్ఎంపీవీ వైరస్ లక్షణాలు ఏంటి? వైరస్ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలివే?
Advertisement

తాజా వార్తలు