రవితేజ కోసం పూజా హెగ్డేని ప్రయత్నం చేస్తున్న దర్శకుడు

మాస్ మహారాజ్ రవితేజ ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో క్రాక్ సినిమాని కంప్లీట్ చేశాడు.ఈ సినిమా మెజారిటీ షూటింగ్ ఇప్పటికే కంప్లీట్ అయ్యింది.

ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ అవుతుంది.ఇదిలా ఉంటే రవితేజ త్వరలో రమేష్ వర్మ దర్శకత్వంలో సినిమాని సెట్స్ పైకి తీసుకొని వెళ్లబోతున్నాడు.

ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ ఇప్పటికే కంప్లీట్ అయ్యింది.హీరోయిన్స్ ఎంపిక పెండింగ్ లో ఉన్నట్లు తెలుస్తుంది.

ఇక ఈ సినిమా కోసం రమేష్ వర్మ స్టార్ హీరోయిన్స్ ని రంగంలోకి దించడానికి ప్లాన్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది.ముఖ్యంగా రవితేజ కోసం ప్రస్తుతం స్టార్ హీరోయిన్ గా ఉన్న పూజా హెగ్డేని ఫస్ట్ ఛాయస్ గా చూస్తున్నట్లు టాక్.

Advertisement

ఈ అమ్మడు తెలుగులో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్, పాన్ ఇండియా మూవీ రాధే శ్యామ్ సినిమాలలో ప్రస్తుతం నటిస్తుంది.ఈ రెండు సినిమాలు షూటింగ్ చివరి దశలో ఉన్నాయి.

అయితే హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ కి జోడీగా ఇప్పటికే పూజా కన్ఫర్మ్ అయ్యింది.అలాగే హిందీలో సల్మాన్ ఖాన్ తో ఒక సినిమా చేయనుంది.

ఈ నేపధ్యంలో పూజా హెగ్డే రవితేజ సినిమాకి ఎంత వరకు ప్రయారిటీ ఇస్తుంది అనేది సందేహంగా ఉంది.ఒక వేళ ఇచ్చిన ఆమెకి డేట్స్ ఎడ్జస్ట్ అయితే చేస్తుంది.

ఈ నేపధ్యంలో పూజా హెగ్డే ఒప్పుకోకుంటే సెకండ్ ఛాన్స్ గా రకుల్ ప్రీత్ సింగ్ కోసం ప్రయత్నం చేస్తున్నారు.రకుల్ ప్రస్తుతం వైష్ణవ్ తో మాత్రమే సినిమా చేస్తుంది.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?

ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే మొదలైన నేపధ్యంలో ఆమె డేట్స్ దొరికే అవకాశం ఉంది.ప్రస్తుతం రకుల్ చేతిలో పెద్దగా సినిమాలు లేకపోవడం వలన ఆమె చేయడానికి ఒప్పుకునే అవకాశం ఉంది.

Advertisement

మరి వీరిద్దరిలో రవితేజతో నటించే ఛాన్స్ ఏ భామ సొంతం చేసుకుంటుంది అనేది చూడాలి.

తాజా వార్తలు