కేజీఎఫ్2తోనే ఎండ్ కార్డ్... సీక్వెల్ ఉండదని దర్శకుడు క్లారిటీ

సౌత్ ఇండియాలో తెరకెక్కుతూ మరోసారి ఇండియన్ వైడ్ గా ట్రెండ్ లో ఉన్న చిత్ర కేజీఎఫ్2.

బాహుబలి, కేజీఎఫ్ సినిమాలు ఇండియన్ వైడ్ గా ఎంత సంచలన విజయాలు నమోదు చేసుకున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

కేజీఎఫ్ సినిమా కన్నడ ఇండస్ట్రీ చరిత్రని తిరగరాసింది.శాండల్ వుడ్ లో చిన్న చిత్రాలు, లో బడ్జెట్ కథలు మాత్రమే వస్తాయని అనుకునే వారికి కేజీఎఫ్ ఊహించని సమాధానం చెప్పింది.

మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాతో యష్ పోషించిన రాఖీభాయ్ పాత్ర సంచలనం సృష్టించింది.దీంతో ఇప్పుడు కేజీఎఫ్ కి సీక్వెల్ గా వస్తున్న కేజీఎఫ్2 మీద భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.

దానికి తోడు సినిమాలో సంజయ్ దత్, రవీనా టాండన్ లాంటి స్టార్ క్యాస్టింగ్ నటిస్తూ ఉండటం వలన సినిమాకి మరింత హైప్ వచ్చింది.మొదటి భాగం కంటే ఎక్కువ బడ్జెట్ తో పార్ట్ 2 ని దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించారు.

Advertisement

ఇదిలా ఉంటే కేజీఎఫ్2 తోనే ఈ సిరీస్ కి ముగింపు చెప్పేస్తారా లేక ఇంకా కొనసాగించే అవకాశం ఉందా అనే డౌట్ ఇప్పుడు చాలా మందికి వస్తుంది.పవర్ ఫుల్ మాఫియా కథాంశం కాబట్టి పొడిగించిన తప్పులేదని చాలా మంది మాట్లాడుకుంటున్నారు.కేజీఎఫ్ సిరీస్ లో కావాల్సినంత విషయం ఉందని, ఎన్ని పార్ట్ లు తీసిన కచ్చితంగా పవర్ ఫుల్ స్టోరీ అవుతుందని సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తుంది.దీనిపై దర్శకుడు ప్రశాంత్ నీల్ క్లారిటీ ఇచ్చేశారు.కేజీఎఫ్2కి ఇంకా కొనసాగింపు ఉండే అవకాశం లేదని తేల్చేశారు.సినిమా అనుకున్న కథ ప్రకారం రాఖీభాయ్ స్టోరీ కేజీఎఫ్2 తో ఎండ్ అయిపోయిందని, ఇంకా కొనసాగించే ప్రయత్నం చేసిన స్టోరీ వీక్ అయిపోయిందని, కథ, కథనంలో దమ్ము లేకపోతే ఆడియన్స్ ని మెప్పించలేమని చెప్పేశాడు.

పోలియోతో రెండు కాళ్లు పడిపోయినా రోజుకు 16 గంటల పని.. వైతీశ్వరన్ సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!
Advertisement

తాజా వార్తలు