Jai Hanuman : జై హనుమాన్ లో హనుమంతుడి పాత్రలో నటించేది ఆ హీరోనా.. ప్రశాంత్ వర్మ ఇచ్చిన క్లారిటీ ఇదే!

టాలీవుడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ( Prasanth Varma ) దర్శకత్వంలో తాజాగా తెరకెక్కిన చిత్రం హనుమాన్.

తేజా సజ్జా హీరోగా నటించిన ఈ సినిమాలో అమృత అయ్యర్ హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే.

అలాగే ఇందులో వరలక్ష్మీ శరత్‌కుమార్‌, వినయ్‌ రాయ్‌ ప్రధాన పాత్రల్లో నటించిన విషయం తెలిసిందే.సంక్రాంతి కానుకగా విడుదలై మంచి విజయాన్ని అందుకుంది.ప్రపంచ వ్యాప్తంగా రూ.210 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది.చిన్న సినిమాగా విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్టును అందుకోవడంతో పాటు ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామిని సృష్టిస్తోంది.

ఈ సినిమా విడుదల అయ్యి ఇన్ని రోజులు అవుతున్నా కూడా ఈ సినిమా మేనియా ఇంకా తగ్గడం లేదు.ఇది ఇలా ఉంటే ఈ సినిమా క్లైమాక్స్ లో ఈ సినిమాకు సీక్వెల్ ఇక్కడ ఉంటుందని ఆ సినిమాకు జై హనుమాన్ ( Jai Hanuman )అనే టైటిల్ ని కూడా ఖరారు చేసిన విషయం తెలిసిందే.దీంతో జై హనుమాన్ మూవీ కోసం అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

ఇకపోతే జై హనుమాన్ మూవీలో ఆంజనేయ స్వామి పాత్రలో ఒక స్టార్ హీరో నటించిన బోతున్నట్లు ఇటీవల డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ప్రకటించిన విషయం తెలిసిందే.దాని కోసం బాలీవుడ్‌ నటులను ఎంపిక చేయడానికి ఆడిషన్స్‌ చేస్తున్నట్లు ఒక ఇంటర్వ్యూలో తెలిపారు.

Advertisement

హనుమంతుడి పాత్రలో బాలీవుడ్‌ ప్రముఖ హీరో నటించే అవకాశం ఉంది.మేకప్‌, లుక్‌ టెస్ట్‌ చేసి ఎంపిక చేయాలనుకుంటున్నా.పాత్రకు తగిన న్యాయం చేయగలరనే వారినే తీసుకుంటాం.

ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి.త్వరలోనే వివరాలు ప్రకటిస్తాం.

జై హనుమాన్‌ మూవీలో దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ నటీనటులు నటించనున్నారు అని పేర్కొన్నారు.హనుమాన్‌ కంటే తాను రూపొందిస్తున్న మరో చిత్రం అధీర పెద్దది అని చెప్పుకొచ్చారు ప్రశాంత్ వర్మ.అందులో కూడా హనుమంతుడి సీన్స్‌ ఉంటాయని అన్నారు.

ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?
Advertisement

తాజా వార్తలు