Director Maruthi: డైరెక్టర్ మారుతి చెప్పిన 100 ఏళ్ళ బార్బర్ స్టోరీ.. నెట్టింట్లో ఫొటోస్ వైరల్?

టాలీవుడ్ డైరెక్టర్ మారుతి( Director Maruthi ) గురించి మనందరికీ తెలిసిందే.

తెలుగులో మంచి రోజులు వచ్చాయి, పక్కా కమర్షియల్, ప్రతిరోజు పండగే, మహానుభావుడు, భలే భలే మగాడివోయ్, శైలజ రెడ్డి అల్లుడు, బాబు బంగారం, ఈ రోజుల్లో .

లాంటి ఎన్నో సినిమాలకు దర్శకత్వం వహించి డైరెక్టర్గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరుచుకున్నారు డైరెక్టర్ మారుతి.ఇది ఇలా ఉంటే తాజాగా డైరెక్టర్ మారుతీ తన సొంత ఊరు అయినా మచిలీపట్నంలో సందడి చేశారు.

కాగా మారుతికి తన ఊరిలో ఒక అనుకోని సంఘటన ఎదురైయింది.తనకు చిన్నతనంలో కటింగ్ చేసిన ఒక బార్బర్ ( Barber ) ఇప్పటికీ కూడా అదే ఊరిలో అదే వృత్తిని కొనసాగిస్తుండడంతో డైరెక్టర్ మారుతి ఆశ్చర్యపోయారు.ప్రస్తుతం ఆ బార్బర్ కి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఆ బార్బర్ తో కలిసి దిగిన ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేశారు.అందుకు సంబంధించిన ఫోటో ని షేర్ చేస్తూ ఈ విధంగా రాసుకొచ్చారు మారుతి.

Advertisement

ఇతని పేరు సీతారామారావు.( Sitarama rao ) ఇతనికి వందేళ్లు.100 సంవత్సరాలైనా ఇతను మా తాతకు, మా నాన్నకు, నాకు కూడా కటింగ్ చేశారు.

ఈయన నా చిన్నప్పటి జ్ఞాపకం. ఈయన దగ్గరే నేను చిన్నప్పుడు కట్టింగ్ చేయించుకునేవాడిని.100 ఏళ్ళు వచ్చినా ఈయన ఇప్పటికీ ఇలాగే వర్క్ చేయడం అన్నది ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది.ఈయన మరింతకాలం బతకాలని కోరుకుంటున్నాను అని మారుతి రాసుకొచ్చాడు.

ప్రస్తుతం అందుకు సంబంధించిన ట్వీట్ ఫొటోస్ సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్నాయి.ఆ ఫొటోస్ పై ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా స్పందిస్తున్నారు.

బార్బర్ ని పొగుడుతూ రియల్లీ చాలా గ్రేట్ అంటూ పొగడ్తలు కురిపిస్తున్నారు.

రామ్ చరణ్ సుకుమార్ సినిమాలో హీరోయిన్ గా చేస్తున్న ఐటెం బ్యూటీ...
Advertisement

తాజా వార్తలు