ప్రతి దేశంలో ఉన్న ప్లేయర్లందరూ వాళ్ల ఎంటైర్ కెరీయర్ లో ఒక్కసారైనా ఐపీఎల్ మ్యాచ్ లు( IPL ) ఆడాలని కోరుకుంటారు.ఎందుకంటే వాళ్లు ఒక్కసారి ఐపీఎల్లో ఆడితే వాళ్ళ జీవితకాలం మొత్తం వాళ్ళ దేశానికి ఆడితే ఎంత గుర్తింపైతే వస్తుందో ఒక ఐపిఎల్ ద్వారానే అంత గుర్తింపు వస్తుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.
ఇక ఐపీఎల్ లాంటి లీగ్ ప్రపంచం లో మరొకటి లేదని చెప్పడం లో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…అందుకే చాలా మంది స్టార్ ప్లేయర్లు( Star Players ) ఐపీఎల్లో ఉత్సాహాన్ని చూపిస్తూ ఆక్షన్ లో పాల్గొంటూ ఉంటారు.ఇక ప్రతిభ ఉన్న ప్లేయర్లకు మాత్రమే ఆడే అవకాశం దక్కుతుంది.నిజానికి ఇక్కడ సత్తా చాటుకున్న చాలా మంది ప్లేయర్లు ఆ తర్వాత వాళ్ల దేశం తరుపున మ్యాచ్ లు ఆడటానికి సెలెక్ట్ అవ్వడం నిజంగా విశేషమనే చెప్పాలి…

అయితే ఐపీఎల్ కి చాలా సంవత్సరాల నుంచి తన సేవలను అందిస్తున్న దినేష్ కార్తీక్( Dinesh Karthik ) మాత్రం ఈ సీజన్ తో ఐపీఎల్ కి రిటైర్ మెంట్ ప్రకటించబోతున్నట్టుగా తెలుస్తుంది.ఇక ఐపీఎల్ అనే కాకుండా ఆయన ఎంటైర్ క్రికెట్ కెరియర్ మొత్తానికి గుడ్ బై చెప్పబోతున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి.ఐపీఎల్ మొదటి సీజన్ నుంచి ఇప్పటివరకు ఆడిన అతి కొద్ది మంది ప్లేయర్లలో దినేష్ కార్తీక్ ఒకరు.రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, ధోని వీళ్ళ తర్వాత దినేష్ కార్తిక్ ఆ ఘనత సాధించాడు…ఇక ఇదిలా ఉంటే ఆయన ఇప్పటి వరకు ఐపీఎల్ లో ఆరు ప్రాంచైజ్ లకు ప్రాతినిధ్య వహించాడు.
అందులో ఢిల్లీ డేర్ డెవిల్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్, కలకత్తా నైట్ రైడర్స్, గుజరాత్ లయన్స్, ముంబై ఇండియన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు టీమ్ లా తరపున ఆడాడు.