ముచ్చటగా మూడోసారి ప్రభాస్ తో దిల్ రాజు.. ఈసారి హై బడ్జెట్ తో.. ఎప్పుడంటే?

టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ లలో దిల్ రాజు ( Dil Raju ) ఒకరు.ఈయన కెరీర్ పరంగా మంచి సక్సెస్ లతో దూసుకు వెళ్తున్నాడు.

చిన్న సినిమాలనే కాకుండా భారీ బడ్జెట్ సినిమాలను కూడా దిల్ రాజు తన ప్రొడక్షన్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు.ఇటీవలే ఈయన బ్యానర్ నుండి వచ్చిన బలగం ఏ రేంజ్ హిట్ కొట్టిందో చెప్పాల్సిన పని లేదు.

చిన్న సినిమాగా వచ్చిన ఈ సినిమా భారీ లాభాలను తెచ్చిపెట్టింది.ఇక దిల్ రాజు ప్రస్తుతం శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై రామ్ చరణ్ ( Ram Charan ) హీరోగా శంకర్ (Shankar) దర్శకత్వంలో గేమ్ చేంజర్ (Game Changer) ను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

ఈ సినిమాపై మెగా ఫ్యాన్స్ భారీ అంచనాలను పెట్టుకున్నారు.ఈ సినిమా వచ్చే ఏడాది రిలీజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Advertisement

ఇదంతా పక్కన పెడితే తాజాగా నిర్మాత దిల్ రాజు తన కెరీర్ స్టార్ట్ చేసి 20 ఏళ్ళు పూర్తి అయ్యింది.

మరి ఈయన రెండు దశాబ్దాల కెరీర్ ను సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకోవడంతో ఈయనకు ప్రముఖులు, ఆడియెన్స్ ప్రత్యేకంగా విషెష్ చెబుతూ సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు.ఈ సందర్భంగా దిల్ రాజు కూడా ప్రేక్షకులతో కొద్దీ సేపు ఆస్క్ దిల్ రాజు పేరుతో చాట్ సెషన్ నిర్వహించారు.మరి ఈ చాట్ సెషన్ లో ప్రేక్షకులు అడిగిన ప్రశ్నలకు దిల్ రాజు సమాధానం ఇచ్చారు.

ఒక అభిమాని డార్లింగ్ ప్రభాస్ తో మళ్ళీ ఎప్పుడు మూవీ చేయబోతున్నారు అని ప్రశ్నించారు.ఈ సందర్భంగా ఈయన సమాధానం చెబుతూ.తప్పకుండ ప్రభాస్ ( Prabha s) తో మరో సినిమా చేస్తాను అంటూ తెలిపారు.

అంతేకాదు మా బ్యానర్ లో ప్రభాస్ తో పెద్ద సినిమా ఉంటుందని.ప్రజెంట్ ఉన్న కమిట్మెంట్స్ పూర్తి అయిన తర్వాత ఈ సినిమా ఉంటుందని తెలిపారు.ఇప్పటికే వీరి కాంబోలో మిస్టర్ పర్ఫెక్ట్, మున్నా( Mr.Perfect ) సినిమాలు రాగ మరో సినిమా ఎప్పుడు వస్తుందో వేచి చూడాల్సిందే.

వైరల్ వీడియో : కారుతో ఢీకొట్టి పరారైన బీజేపీ అధ్యక్షుడి కుమారుడు..
Advertisement

తాజా వార్తలు