దిల్ రాజు అందుకే ధైర్యం చేస్తున్నాడా..!  

Dil Raju Dare To Release Pongal War -

ఈసారి సంక్రాంతి బరిలో దిల్ రాజు ఎంత సాహసం చేస్తున్నాడో తెలిసిందే.ఓ పక్క మెగాస్టార్ 9 ఏళ్ల తర్వాత చెస్తున్న ఖైది నెంబర్ 150 సంక్రాంతి టార్గెట్ పెట్టగా మరో పక్క బాలయ్య కూడా సంక్రాంతికి నేను వస్తున్నా అంటూ గర్జిస్తున్నాడు.

అయితే ఈ రెండు సినిమాలకు పోటీగా శతమానం భవతి అంటూ రిలీజ్ ఫిక్స్ చేశాడు దిల్ రాజు.సతీష్ వేగేశ్న డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా శర్వానంద్, అనుపమ లీడ్ రోల్స్ చేస్తున్నారు.

Dil Raju Dare To Release Pongal War--Telugu Tollywood Photo Image

ఇక దసరా కానుకగా నిన్న రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ ఇంప్రెసివ్ గా ఉండటమే కాకుండా నిన్న సాయంత్రం రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ టీజర్ కూడా ఉల్లాసంగా ఉంది.

కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ సినిమా కచ్చితంగా ప్రేక్షకులను అలరిస్తుందని టీజర్ చూస్తేనే అర్ధమవుతుంది.

తాత మనవళ్ల మధ్య జరిగే ఈ కథ కొత్తగా ఉంటుందని మరోసారి బొమ్మరిల్లు సినిమాను గుర్తు చేస్తుందని అంటున్నారు దిల్ రాజు.అయితే సినిమా మీద ఉన్న ఆ నమ్మకంతోనే పోటీ అని తెలిసినా సరే సంక్రాంతికి దిగుతున్నాడు దిల్ రాజు.

తాజా వార్తలు

Dil Raju Dare To Release Pongal War- Related....