మొదటిసారి కొడుకు భార్యతో తిరుమల వచ్చిన దిల్ రాజు... ఫోటోలు వైరల్?

టాలీవుడ్ ఇండస్ట్రీలో బడా నిర్మాతలలో ఒకరిగా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న ప్రొడ్యూసర్ దిల్ రాజు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.ఈయన దిల్ సినిమాతో నిర్మాతగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు.

 Dil Raju Came To Tirumala With His Sons Wife For The First Time Photos Viral,di-TeluguStop.com

ఈ సినిమా మంచి విజయం అందుకోవడంతో ఈయన ఇండస్ట్రీలో నిర్మాతగా స్థిరపడిపోయారు.ఈ సినిమా అనంతరం పలు సినిమాలకు నిర్మాతగా వ్యవహరించిన దిల్ రాజు వరుస విజయాలను అందుకోవడంతో ఈయన టాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర నిర్మాతగా కొనసాగుతున్నారు.

ఇకపోతే ఒకప్పుడు కేవలం అత్యంత తక్కువ బడ్జెట్ తో కేవలం తెలుగు సినిమాలను మాత్రమే నిర్మించే దిల్ రాజు ప్రస్తుతం వందల కోట్ల బడ్జెట్ సినిమాలను తెరకెక్కించి పాన్ ఇండియా స్థాయిలో సినిమాలను విడుదల చేస్తున్నారు.ఇలా సినిమా ఇండస్ట్రీలో నిర్మాతగా గొప్ప పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఈయన వ్యక్తిగత విషయానికి వస్తే… దిల్ రాజు మొదటి భార్య అనిత 2017వ సంవత్సరంలో గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే.

ఈ క్రమంలోనే 2020 వ సంవత్సరంలో దిల్ రాజు కూతురు స్వయంగా దగ్గరుండి తన తండ్రికి రెండవ వివాహం చేశారు.

Telugu Dil Raju, Tejaswini, Tirumala, Tollywood-Movie

ఈ విధంగా దిల్ రాజు తేజస్విని అనే అమ్మాయిని రెండవ వివాహం చేసుకున్నారు.ఇకపోతే ఈ దంపతులు జులై 29వ తేదీ మగ బిడ్డకు జన్మనిచ్చారు.ఇలా దిల్ రాజు కుటుంబానికి వారసుడు రావడంతో ఈయన ఎంతో సంతోషం వ్యక్తం చేశారు.

ఇకపోతే హాస్పిటల్లో తన కొడుకుని చూస్తూ మురిసిపోతున్న ఫోటోని షేర్ చేసిన దిల్ రాజు తాజాగా మొదటిసారిగా తన కొడుకుతో కలిసి మీడియా ముందుకు వచ్చారు.ఇకపోతే దిల్ రాజు తన భార్య కొడుకుతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శనం చేసుకున్న అనంతరం ఆలయం వెలుపల సందడి చేశారు.

ఈ క్రమంలోనే ఈయనకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube