కాంగ్రెస్ లొల్లి.. ఇప్పట్లో తగ్గదా ?

టి కాంగ్రెస్ గత కొన్నాళ్లుగా అంతర్గత కుమ్ములాటలతో సతమతమౌతోంది.

ముఖ్యంగా రేవంత్ రెడ్డి టీపీసీసీ అధ్యక్ష పదవి చేపట్టిన తరువాత నుంచి పూర్తిగా స్థితిగతులే మారిపోయాయని చెప్పక తప్పదు.

రేవంత్ రెడ్డి బాద్యతలు చేపట్టిన తరువాత పార్టీలోని సీనియర్ నేతల నుంచి తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తమౌతు వస్తోంది.రేవంత్ రెడ్డి నిర్ణయాలను సీనియర్ నేతలు వ్యతిరేకించడం.

అలాగే సీనియర్ నేతలను పట్టించుకోకుండా రేవంత్ స్వతహాగా పార్టీ కార్యమలను చేపట్టడం లాంటి పరిణామాలతో హస్తం పార్టీలో రేవంత్ రెడ్డి వర్సస్ సీనియర్స్ ఎపిషోడ్ ఎప్పుడు కూడా హాట్ టాపిక్ గా మారుతూ వచ్చింది.

ఇది ఏ స్థాయిలో ఉందంటే.కాంగ్రెస్ లో జరుగుతున్నా ఈ అంతర్మథనం వల్ల ఆ పార్టీ బలం రోజురోజుకూ దిగజారుతూనే ఉంది.రేవంత్ రెడ్డి మరియు సీనియర్స్ మద్య సయోద్య కుదిరించేందుకు అధిష్టానం ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పటికి సరైన ఫలితాలు కనిపించడం లేదు.

Advertisement

ఆ మద్య జోడో యాత్ర ద్వారా తెలంగాణలో పర్యటించిన రాహుల్ గాంధీ పార్టీని బలోపేతం చేసేందుకు అందరూ కలిసి కట్టుగా కృషి చేయాలని, అంతర్గత విభేదాలను వీడాలని కాస్త గట్టిగానే సూచించారు.దాంతో కొన్నాళ్లు కలగలుపుగా ఉన్న రేవంత్ రెడ్డి మరియు పార్టీ సీనియర్లు.

తాజాగా మళ్ళీ మొదటికి వచ్చారు.హత్ సే హాట్ జోడో పేరుతో రేవంత్ రెడ్డి పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే.

అయితే రేవంత్ రెడ్డి పాదయాత్రకు పార్టీ సీనియర్స్ అందరూ కూడా దూరంగా ఉన్నారు.

ఏదో నామమాత్రంగా మద్దతు ప్రకటిస్తున్నప్పటికి రేవంత్ తో కలిసి పాదయాత్రలో పాల్గొనలేదు.కానీ ఊహించని విధంగా అదే పార్టీ నేత ఏలేటి మహేశ్వర రెడ్డి చేపట్టిన పాదయాత్రలో మాత్రం సీనియర్స్ అందరూ దర్శనమిచ్చారు.నిర్మల్ లో మహేశ్వర రెడ్డి చేపట్టిన పాదయాత్రలో సీనియర్ నేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్క, దామోదర రాజనర్సింహా వంటి వారు పాల్గొన్నారు.

మహేష్ తో మల్టీస్టారర్ పై కార్తీ ఆసక్తికర వ్యాఖ్యలు.. మేమిద్దరం క్లాస్ మేట్స్ అంటూ?
జీవితం మహా చెడ్డది భయ్యా.. భార్య వల్ల చెత్త ఏరుకునే స్థాయికి ఇంజనీర్‌..?

ఇప్పుడిదే హాట్ టాపిక్ గా మారుతోంది.ఎందుకంటే అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పాదయాత్రలో పాల్గొనని సీనియర్స్ మహేశ్వరరెడ్డి పాదయాత్రలో పాల్గొనడం ఎంటనే ప్రశ్నలు వస్తున్నాయి.దీన్ని బట్టి చూస్తూ రేవంత్ రెడ్డి మరియు సీనియర్స్ మద్య ఇంకా కోల్డ్ వార్ జరుగుతున్నట్లే కనిపిస్తోంది.

Advertisement

మరి ఎన్నికల నాటికైనా హస్తం పార్టీలో నెలకొన్న ఈ లొల్లి తగ్గుతుందో లేదో చూడాలి.

తాజా వార్తలు