తెనాలి టీడీపీలో జనసేన పొత్తు చిచ్చు..!!

తెనాలి నియోజకవర్గ టీడీపీలో జనసేన( Janasena ) పొత్తు చిచ్చు పెట్టింది.

తెనాలి టికెట్ ను జనసేన నేత నాదెండ్ల మనోహార్ కు( Nadendla Manohar ) ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు.

ఈ క్రమంలో నియోజకవర్గ టీడీపీ నేత ఆలపాటి రాజేంద్రప్రసాద్( Alapati Rajendra Prasad ) అసంతృప్తి గళం వినిపిస్తున్నారు.అలాగే ఆలపాటికే సీటు కేటాయించాలని పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.

తెనాలి నియోజకవర్గ సీటును( Tenali Constituency ) జనసేనకు ఇస్తే మూకుమ్మడి రాజీనామాలు చేస్తామని టీడీపీ నేతలు హెచ్చరిస్తున్నారని తెలుస్తోంది.

మరోవైపు ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఇవాళ మరోసారి పార్టీ నేతలు, కార్యకర్తలతో అత్యవసర సమావేశం కానున్నారు.గుంటూరులో నిర్వహించే ఈ సమావేశంలో తెనాలి టికెట్ ను ఆలపాటి రాజాకే ఇవ్వాలని పార్టీ నేతలు తీర్మానం చేయనున్నారు.అనంతరం ఆ తీర్మానాన్ని టీడీపీ( TDP ) అధిష్టానానికి పంపనున్నారని సమాచారం.

Advertisement

కాగా ఇప్పటికే రెండు దఫాలుగా ఆయన స్థానిక నేతలతో సమావేశమైన సంగతి తెలిసిందే.

ఇదేందయ్యా ఇది.. కోవిడ్ 19 థీమ్‌తో పార్కు.. వీడియో చూస్తే నోరెళ్లబెడతారు..
Advertisement

తాజా వార్తలు