ప‌వ‌న్‌కు - రామోజీకి చెడిందా..!

ఈనాడు మీడియా సంస్థ‌ల అధినేత రామోజీరావుకు తెలుగు రాజ‌కీయాల్లో చాలా చ‌రిత్ర ఉంది.

ఆయ‌న తెలుగు రాజ‌కీయాల్లో తెర‌ముందు ఎప్పుడూ క‌నిపించ‌క‌పోయినా తెర‌వెన‌క మాత్రం రామోజీ ఎలాంటి పాత్ర పోషిస్తారో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు.

ఇక రామోజీకి జ‌న‌సేన అధినేత‌, సినిమా స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌కు కూడా చాలా స‌న్నిహిత సంబంధాలే ఉన్నాయి.గ‌త ఎన్నిక‌ల్లో ప‌వ‌న్‌-టీడీపీ మ‌ధ్య మిత్ర‌త్వాన్ని కుద‌ర్చ‌డంలో రామోజీ కూడా కీ రోల్ పోషించాడ‌న్న వార్త‌లు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే.

ఆ త‌ర్వాత కూడా వీరిద్ద‌రు ఎంతో స‌న్నిహితంగా ఉన్నారు.ప‌వ‌న్ పార్టీ మీటింగుల‌కు ఈనాడుతో పాటు ఈనాడు ఛానెల్స్‌లో అదిరిపోయే క‌వ‌రేజ్ ద‌క్కుతోంది.

జ‌నసేకు రాజ‌కీయంగా ప్ర‌జాప్ర‌తినిధులు లేకపోయినా, ఆ పార్టీ ఇంకా క్షేత్ర‌స్థాయిలో బ‌లం పుంజుకోక‌పోయినా ఈనాడులో మాత్రం అంచ‌నాల‌కు మించిన క‌వ‌రేజ్ ద‌క్కుతోంది.ఇదంతా రామోజీతో పవన్ కు గల సాన్నిహిత్యం వ‌ల్లే అనుకోవ‌చ్చు.

Advertisement

అయితే లేటెస్ట్ ప‌రిణామాలు చూస్తుంటే ప‌వ‌న్‌కు రామోజీకి గ్యాప్ వ‌చ్చిందా ? అంటే అవున‌నే అంటున్నాయి రాజ‌కీయ‌వ‌ర్గాలు.గ‌తంలో ఈనాడు టీవీ వాళ్ల ఫంక్ష‌న్ జ‌రిగితే ఆ కార్య‌క్ర‌మానికి ప‌వ‌న్ ప్ర‌త్యేక అతిథిగా హాజ‌ర‌య్యాడు.

రామోజీ ప‌క్క‌న కూర్చున్నాడు.వారిద్ద‌రు ఏవో గుస‌గుస‌లాడుకున్నారు.

ఇక తాజాగా జ‌రిగిన ప‌వ‌న్ కాట‌మ‌రాయుడు ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్‌కు మాత్రం ప‌వ‌న్ వేరే మీడియాల‌కు చెందిన అధినేత‌లు, సీఈవోల‌ను పిలుచుకున్నాడు.ప‌వ‌న్ కాట‌మ‌రాయుడు ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్‌కు ఎన్టీవీ అధినేత తుమ్మ‌ల న‌రేంద్ర‌చౌద‌రితో పాటు టీవీ-9 సీఈవో ర‌విప్ర‌కాష్ హాజ‌ర‌వ్వ‌డం ఆశ్చ‌ర్య‌ప‌రిచింది.

వీరిద్ద‌రు ప‌వ‌న్‌ను ఆకాశానికి ఎత్తేశారు.రామోజీతో పవన్ కు దూరం పెరిగిందని, అందుకే ప‌వ‌న్ వేరే టీవీ ఛానెళ్ల అధినేత‌ల‌తో రాసుకు పూసుకు తిరుగుతున్నాడ‌న్న గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఇప్పుడైనా జగన్ ను విమర్శిస్తారా ? మోది టూర్ పై కూటమి నేతల ఆశలు

వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప‌వ‌న్ ఒంట‌రిగా పోటీ చేస్తుండ‌డంతో ఈనాడు స‌పోర్ట్ ఎలాగూ ఉండ‌ద‌ని డిసైడ్ అయ్యే ప‌వ‌న్ మీడియాలో కొత్త మిత్రుల‌తో స్నేహం చేస్తున్నాడ‌న్న టాక్ కూడా వ‌స్తోంది.

Advertisement

తాజా వార్తలు