1951 ఎన్నికలకు ఇప్పటి ఎన్నికలకు ఎంత తేడానో తెలుసా... ఖర్చు లెక్కల మార్పు చూస్తే నోరు వెళ్లబెట్టాల్సిందే

దేశ వ్యాప్తంగా నేడు పార్లమెంటు సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా మొదటి దశ పోలింగ్‌ జరుగుతుంది.

తెలుగు రాష్ట్రాలతో పాటు ఇంకా పలు నియోజక వర్గాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి.

ఈ ఎన్నికల్లో పోటీ చేసిన వారు పెద్ద మొత్తంలో డబ్బును ఖర్చు చేశారు.అధికారికంగా ఒక పార్లమెంటు అభ్యర్థి ప్రచారం కోసం 70 లక్షల వరకు ఖర్చు చేసుకోవచ్చు.

అంతకు మించి ఖర్చు చేసి ఆ అభ్యర్థి ఎన్నికల్లో గెలిచినా ఓడినా శిక్షార్హుడు అవుతాడు.అంటే 70 లక్షలకు ఒక్క రూపాయి మించినా కూడా గెలిచిన కూడా అతడిని పదవి నుండి తొలగించే అవకాశం ఉంటుంది.

ఒక్కో అభ్యర్థి 70 లక్షలు ఖర్చు చేసి గెలవడం అంటే అయ్యే మాటలు కాదు.ఎన్నికల ఖర్చు ఇప్పుడు పదుల కోట్లు దాటి వందల కోట్లకు చేరుకుంది.

Advertisement

ఒక్కో అభ్యర్థికి 70 లక్షల లిమిట్‌ ఉన్నా కూడా వారు అడ్డ దారిలో 10 నుండి 30 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నారు.కొన్ని ఏరియాల్లో ఇంకా ఎక్కువ కూడా ఖర్చు చేస్తున్నారు.

ప్రతిష్టాత్మకంగా భావించే వారు 70 నుండి 100 కోట్ల వరకు కూడా ఖర్చు చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.అయితే అదంతా కూడా అనఫిషియల్‌.

ఎన్నికల కమీషన్‌ కు ఇచ్చే లెక్కల ప్రకారం అయితే 70 లక్షలు ఖర్చు చేసుకోవచ్చు అంటే తాము కేవలం 50 లక్షలు మాత్రమే ఖర్చు చేశాం అని చెప్పుకుంటారు.ఎన్నికల ఖర్చు ఎంత పెంచుతున్నా కూడా అధికారులు దాన్ని మించే పెడుతున్నారు.

అలాంటప్పుడు లిమిట్‌ పెట్టి ఏం ప్రయోజనం అంటున్నారు.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
తల్లీదండ్రులు మట్టి కార్మికులు.. 973 మార్కులు సాధించిన శ్రావణి.. ఈమె సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!

ఇండియాలో మొట్ట మొదటి ఎన్నికలు 1951లో జరిగాయి.ఆ ఎన్నికల్లో ఒక ఎంపీ అభ్యర్థి 10 వేల నుండి 25 వేల వరకు ఖర్చు చేసుకునే వెసులు బాటు కలిగించారు.అప్పట్లో అంతకు మించి ఖర్చు చేసే వారు కాదు, కొందరు అయిదు పది వేలు కూడా ఖర్చు చేయకుండా గెలిచే వారు.1957 ఎన్నికల్లో 25 వేల రూపాయలను కొనసాగించారు.1962 ఎన్నికల్లో మాత్రం ఎన్నికల ఖర్చును చాలా తగ్గించారు.అంతా కూడా 10 వేలకు ఒక్క రూపాయి ఖర్చు చేయవద్దని చెప్పారు.1967 ఎన్నికల్లో మళ్లీ పెద్ద రాష్ట్రాల అభ్యర్థులు 25 వేలు, చిన్న రాష్ట్రల అభ్యర్థులు 10 వేలు ఖర్చు చేసుకోవచ్చు అన్నారు.

Advertisement

1985 జరిగిన ఎన్నికల కోసం ఖర్చు పెంచారు.అప్పుడు మొదటి సారి ఎన్నికల ఖర్చు లక్షల్లోకి పెరిగింది.అభ్యర్థులు కూడా 1985 ఎన్నికల నుండి కోట్లు కుమ్మరించడం మొదలు పెట్టారు.1977 ఎన్నికల వరకు నిర్ణయించిన ఖర్చునే అభ్యర్థులు పెట్టే వారు, కాని 1985 నుండి పరిస్థితి పూర్తిగా మారిపోయింది.ఒక్కో అభ్యర్థి గెలుపు కోసం కోట్లు కుమ్మరిస్తూ వస్తున్నారు.

గెలవడం కోసం నానా గడ్డి తింటున్నారు.ఏ సంవత్సరంలో ఎంత ఖర్చు చేసుకోవడానికి ఈసీ అనుమతి ఇచ్చిందనేది ఈ కింద చాట్‌లో చూడవచ్చు.

తాజా వార్తలు