మహేశ్ బాబు ఇంటిని ఎప్పుడైనా చూశారా ?

సూపర్ స్టార్ మహేశ్ బాబుకున్న క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు.తన అద్భుతమైన నటనతో ఎంతో మంది అభిమానులను సంపాధించుకున్నారు ఈయన.

కాగా ఎన్నో సినిమాల్లో నటిస్తూ ఎప్పుడూ బిజీ బిజీగా గడుపుతుంటారు.ఈయనకున్న ఫాలోయింగ్ మాత్రం లెక్కలేనిదనే చెప్పుకోవచ్చు.

ఈ దూకుడు సినిమాలు రిలీజ్ అవుతున్నాయంటే చాలు బాక్సాపీస్ లు ఫుల్ కాల్సిందే.కలెక్షన్ల వర్షం కురవాల్సిందే.

కాగా ఈయన ఎన్నో సంస్థలకు బ్రాండ్ అంబాసీడర్ గా కూడా వ్యవహరిస్తున్నారు.వాటి ద్వారా ఈ హీరో రెమ్యునరేషన్ ను భారీగానే అందుకుంటున్నారన్న సంగతి తెలిసిందే.

Advertisement

అలాగే సినిమాల్లోనూ ఈ హీరో తన ప్రతిభకు వసూళ్లను కూడా భారీగానే అందుకుంటున్నారు ఈ శ్రీమంతుడు.మరి ఈ శ్రీమంతుని ఇల్లు ఎలా ఉందో తెలుసుకోవాలనుకుంటున్నారా.

అయితే మీ కోరిక తీరినట్టేనండోయ్.అవునండి మహేశ్ బాబు వైఫ్ నమ్రత వాళ్లింటికి సంబంధించిన కొన్ని పిక్స్ ను పోస్ట్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచిందండోయ్.

మరి మీరు కూడా మన మహర్షి ఇల్లు ఎలా ఉందో ఓ లుక్కేయండి.

చాలా మంది అభిమానులకు తమ హీరో, హీరోయిన్ల ఇండ్లు ఎలా ఉంటాయో తెలుసుకోవాలనే కూతూహలత చాలానే ఉంటుంది.దాని కోసం సోషల్ మీడియాలో తెగ వెతేకేస్తుంటారు.మా హీరో ఇల్లు ఎలా ఉందంటూ.

హెచ్‎సీయూ విద్యార్థి రోహిత్ వేముల కేసు క్లోజ్..!
హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడంటే..?

మరీ ముఖ్యంగా మహేశ్ బాబు ఫ్యాన్స్ కు ఆ ఆత్రుత కూసింత ఎక్కువనే చెప్పుకోవచ్చు.అందుకోసమే మహేశ్ బాబు శ్రీమతి ఆయన ఫ్యాన్స్ కోరికను తీర్చేందుకోమో మరి తమ ఇంటికి సంబంధించిన కొన్ని ఫోటోలను నమ్రత ఇన్ స్టా లో పోస్ట్ చేసింది.

Advertisement

ఇంకేముంది ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టాయి.ఇన్ని రోజులు మా హీరో ఇల్లు ఎలా ఉందోనని తెలుసుకోవాలనుకునే వారు ఈ ఫోటోల పట్ల ఆసక్తి కనబరిచారు.

మహేశ్ ఇల్లుకి సంబంధించిన ఫోటోలను చూసి ఆయన అభిమానులు వావ్ ఎంత భాగుందోనని అనకుండా ఉండలేరోమోననిపిస్తోంది.ఆకర్షించే స్విమ్మింగ్ పూల్, దేవుడి కోసం ఎంతో అందంగా ఏర్పాటు చేసిన రూం, వర్క్ రూం, అతి పెద్ద లివింగ్ ఏరియా, గేమ్స్ రూం.ఇలాంటి ఎన్నో రూం లతో తన ఇంటిని ఎంతో అందంగా నిర్మించుకున్నట్టు తెలుస్తోంది.కాని ఈ ఇంటి ఫోటోలను చూసిన నెటిజన్ల ఆనందానికి అవదుల్లేకుండా పోతున్నాయి.

మరి మీరు కూడా మన శ్రీమంతుని ఇల్లు ను ఒక సారి లుక్కేసేయండి.

తాజా వార్తలు