ఈ హీరోయిన్ మీకు ఇంకా గుర్తుందా...? ఇప్పుడు ఎం చేస్తోందో...

టాలీవుడ్ ప్రముఖ స్వర్గీయ దర్శకుడు కోడి రామకృష్ణ దర్శకత్వం వహించిన "పిలిస్తే పలుకుతా.

!" అనే చిత్రంలో హీరోయిన్ గా నటించి ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్న బాలీవుడ్ బ్యూటీ "షమిత శెట్టి" ఇప్పటికే తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే.

అయితే ఈమె తెలుగులో నటించింది ఒకే ఒక్క చిత్రం అయినప్పటికీ తన నటనతో ప్రేక్షకులని బాగానే అలరించింది.అంతేకాక ఈ చిత్రంలోని "మనసా ఒట్టు మాటాడొద్దు" అనే పాట ఇప్పటికీ చాలామందికి ఫేవరెట్ పాటగా ఉంటుంది.

అయితే ఈ అమ్మడికి ప్రస్తుతం 40 ఏళ్ళు దాటినప్పటికీ ఎందుకు పెళ్లిపై ఆసక్తి ఇ కనబర్చడం లేదు.అలాగని సినిమాలపై కూడా పెద్దగా దృష్టి సారించడం లేదు.

అయితే ఈ అమ్మడు ఒకప్పుడు బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా వెలుగొందినటువంటి జీరో సైజ్ నడుము సుందరి శిల్పా శెట్టి చెల్లెలని ఇప్పటికీ చాలా మందికి తెలియదు.అయితే ప్రస్తుతం షమితా శెట్టి ముంబైలోని తన సొంత నివాసంలో ఉంటున్నట్లు సమాచారం.

Advertisement

అయితే ఈ విషయం ఇలా ఉండగా ఈ అమ్మడు తెలుగు, తమిళం, హిందీ, మలయాళం తదితర భాషలలో కలిపి దాదాపుగా 20 కి పైగా చిత్రాలలో హీరోయిన్ గా నటించింది.అలాగే 2009వ సంవత్సరంలో బాలీవుడ్ బిగ్ బాస్ మూడవ సీజన్ లో కూడా కంటెస్టెంట్ గా పాల్గొంది.

ప్రస్తుతం ఈ అమ్మడి చేతిలో సినిమా అవకాశాలు లేకపోవడంతో పలు రకాల ఫోటో షూట్ సంస్థలు నిర్వహిస్తున్న ఫోటో షూట్ కార్యక్రమాలలో పాల్గొంటూ ఫోటోలకు ఫోజులు ఇస్తోంది.అలాగే ఈ ఫోటోలను తన అధికారిక సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా షేర్ చేస్తూ అభిమానులతో అందుబాటులో ఉంటోంది.

Advertisement

తాజా వార్తలు