ఈ యంగ్ హీరో మేనత్త కూడా తెలుగులో పెద్ద నటి అని మీకు తెలుసా..?

తెలుగులో ప్రముఖ స్వర్గీయ సీనియర్ దర్శకుడు ఈ.వి.వి.

సత్యనారాయణ దర్శకత్వం వహించిన "ఆ ఒక్కటి అడక్కు" అనే చిత్రంలో హీరో రాజేంద్ర ప్రసాద్ చెల్లెలి పాత్రలో నటించి తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న సీనియర్ నటి లత శ్రీ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే తెలుగులో నటించినటువంటి అల్లరోడు, యమలీల, మేడమ్ తదితర చిత్రాలు అప్పట్లో ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాయి.

ఇటీవల ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో పాల్గొని ఈ కార్యక్రమంలో భాగంగా తన కుటుంబ సభ్యుల గురించి పలు ఆసక్తికర అంశాలను ప్రేక్షకులకు పంచుకుంది.అయితే ప్రస్తుతం టాలీవుడ్ లో ప్రముఖ సినీ నిర్మాతగా కొనసాగుతున్న నిర్మాత శంకర్ ప్రసాద్ స్వయానా తన సొంత అన్నయ్యని కానీ ఆ విషయం తానెప్పుడూ ఎలాంటి సందర్భాల్లో కూడా బయటకి చెప్పలేదని చెప్పుకొచ్చింది.

 అయితే నిర్మాత శంకర్ ప్రసాద్ తన సొంత అన్నయ్య అయినప్పటికీ తమ కుటుంబ పరిస్థితుల కారణంగా తామెప్పుడూ గాని, తన మేనల్లుడు నాగశౌర్య గురించి కుటుంభం సభ్యుల గురించిగాని ఇంటర్వ్యూలలో ప్రస్తావించానని కూడా తెలిపింది.అయితే తాను 19 ఏళ్లకే పెళ్లి చేసుకోవడంతో సినిమా కెరియర్ వదిలి పెట్టానని కాగా ప్రస్తుతం తనకు ఇద్దరు పిల్లలు ఉన్నారని ఇందులో మొదటి కొడుకు ఇంజనీరింగ్ రెండవ సంవత్సరం చదువుతుండగా రెండవ కొడుకు ఇంటర్మీడియట్ చదువుతున్నాడని తెలిపింది.

అయితే అప్పుడెప్పుడో తన మేనల్లుడు నాగశౌర్య హీరోగా నటించినటువంటి ఊహలు గుసగుసలాడే తన తల్లితో కలిసి సినిమా థియేటర్లో చూశానని కానీ తన తల్లి చనిపోయిన తర్వాత మళ్ళీ వారితో ఎలాంటి సంబంధాలు లేవని కూడా స్పష్టం చేసింది.

Advertisement
రామ్ చరణ్ సుకుమార్ సినిమాలో హీరోయిన్ గా చేస్తున్న ఐటెం బ్యూటీ...

తాజా వార్తలు