భారతదేశంలోని మొట్టమొదటి మసీదు గురించి మీకు తెలుసా?

భారతదేశంలోని పురాతన మసీదు కేరళలోని త్రిసూర్ జిల్లాలో ఉంది.ఈ మసీదును చేరమాన్ జుమా మసీదు అని పిలుస్తారు.

ఈ మసీదుకు సంబంధించిన కొన్ని ప్రత్యేక విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.చేరమాన్ జుమా మసీదు కేరళలోని త్రిసూర్ జిల్లా పరిధిలోని కొడంగలూరు తాలూకాలో ఉంది.

ఈ మసీదు దాని లౌకిక భావజాలానికి ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది.ఈ మసీదు మహమ్మద్ ప్రవక్త కాలంలో నిర్మించార‌ని చెబుతారు.

ఈ మసీదును భారతదేశపు మొదటి మసీదు అని కూడా అంటారు.మసీదు అనేక సార్లు పునరుద్ధరణ జ‌రిగింది క్రీ.శ.629లో ఈ మసీదు నిర్మాణం జరిగిందని చెబుతారు.భారతీయ ఉపఖండంలోని పురాతన మసీదు ఇదే కావ‌డంతో ఇప్పటికీ ప్రార్థనలు చేయడానికి వస్తుంటారు.

Advertisement

ఈ మసీదుకు రాజా చేరమాన్ పెరుమాళ్ పేరు పెట్టార‌ని చెబుతుంటారు.ఈ రాజు పెరుమాళ్ ఒకసారి అరేబియా వెళ్ళాడు.

ఇక్కడ అతను ఒక సూఫీ సన్యాసిని కలిశాడు.దీని తరువాత రాజా చేరమాన్ ఇస్లాం స్వీకరించాడు.

తన పేరును తాజుద్దీన్‌గా కూడా మార్చుకున్నాడు.అతను జెడ్డా రాజు సోదరిని వివాహం చేసుకున్నాడు.

ఆ తర్వాత జెడ్డాలో నివాసం ఉండ‌సాగాడు.రాజు తన మరణానికి ముందు కేరళ పాలకులకు కొన్ని లేఖలు రాశాడని ఇక్కడి ప్రజలు నమ్ముతారు.

రాజమౌళి వల్లే టాలీవుడ్ హీరోలకు ఈ స్థాయిలో గుర్తింపు.. నమ్మకపోయినా నిజమిదేనా?
బర్త్ డే క్వీన్ నవీన రెడ్డి : మంచి పాత్రలు చేస్తూ ఇండస్ట్రీ లో స్టార్ ఇమేజ్ దక్కించుకున్న నటి...

ఈ లేఖల్లో కేరళలో ఇస్లాం మతాన్ని ప్రచారం చేయాలని కోరారు.జెడ్డా రాజు కేరళకు వచ్చి కొడంగలూరు రాజును కలిశాడు.

Advertisement

ఈ సమావేశంలో కొడంగల్లు రాజుకు మసీదు నిర్మాణానికి సహాయం చేస్తానని హామీ ఇచ్చాడు.ఈ మసీదు నిర్మాణం హిందూ మత ప్రభావంతో హిందూ కళ మరియు వాస్తుశిల్పం ఆధారంగా జరిగిందని చాలా మంది చెబుతారు.

ఈ మసీదులో ముగ్గురు గొప్ప ఇస్లామిక్ అనుచరుల సమాధులు కూడా ఉన్నాయి.

తాజా వార్తలు