రంగులు మారే వినాయకుడి ఆలయం ఎక్కడ ఉందో తెలుసా..?

రంగులు మారే ఊసరవెల్లిని చూసాము, కానీ రంగులు మార్చే దేవుడిని ఎప్పుడైనా చూశారా? అవును మీరు చదువుతున్నది నిజమే ముక్కోటి దేవతలలో తొలిపూజ అందుకునేది వినాయకుడు అనే విషయం మనందరికీ తెలిసినదే.

తొలి పూజలు అందుకుని విఘ్నాలను అంతం చేసే దేవుడిగా వినాయకుడిని పూజిస్తారు అందుకే వినాయకుడికి విఘ్నేశ్వరుడు అనే పేరు కూడా కలదు.

మన దేశంలో ఎన్నో వినాయకుడి ఆలయాలు ఉన్నప్పటికీ తమిళనాడులో ఉండే ఈ ఆలయం ఎంతో ప్రత్యేకమైనది.ఈ ఆలయంలోని వినాయకుడు ప్రతి ఆరు నెలలకు ఒకసారి రంగులు మారుతాడు.

ఈ విధంగా రంగులు మార్చడానికి గల కారణం, ఈ ఆలయ విశిష్టత ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం.తమిళనాడులోని నాగర్‌కోయిల్ జిల్లాలోని కేరళపురం గ్రామంలో ఈ వినాయకుడి ఆలయం ఉంది.

ఈ ఆలయాన్ని శ్రీ మహాదేవర్ అతిశయ వినాయగర్ ఆలయం అని కూడా అంటారు.చూడడానికి చిన్నదిగా ఉండే ఈ ఆలయంలో ఎన్నో విశేషాలు అద్భుతాలకు నిలయం అని చెప్పవచ్చు.

Advertisement

ఇందులో ముఖ్యంగా ఈ ఆలయంలో ఉన్న మూలవిరాట్ ప్రతి ఆరు నెలలకు ఒకసారి తనంతట తానే రంగులు మార్చుకొని ఎంతో అద్భుతంగా కనిపిస్తారు.

ఈ ఆలయంలో ఉన్న వినాయకుడు ఉత్తరాయణ కాలంలో నల్లని రంగులో భక్తులకు దర్శనమిస్తాడు.అదేవిధంగా దక్షిణాయన కాలంలో తెలుపు రంగులోకి మారి భక్తులకు దర్శనమిస్తూ ఉంటాడు.ఈ విధంగా మూలవిరాట్ రంగులు మార్చుకోవడం సాక్షాత్తు ఆ వినాయకుడి మహిమ అని విశ్వసిస్తారు.

అదే విధంగా ఈ ఆలయంలో ఉన్న కోనేరులో మరొక అద్భుతం చోటు చేసుకుంటుంది.ఉత్తరాయణ కాలంలో వినాయకుడు నలుపురంగులో ఉంటే కోనేరులో ఉన్న నీళ్ళు ఎంతో తేటగా తెలుపు రంగులోకి మారుతాయి.

అదేవిధంగా దక్షిణాయన కాలంలో వినాయకుడు తెలుపు రంగులో ఉంటే కోనేరులో నీరు ముదురు నలుపు రంగులోకి మారుతాయి.అదే విధంగా ఈ ఆలయంలో ఉన్న మర్రిచెట్టు దక్షిణాయన కాలంలో ఆకులు రాల్చి ఉత్తరాయణ కాలంలో చిగురిస్తుంది.

బన్నీ, విష్ణు పక్కనున్న ఈ బుడ్డోడు ఎవరో తెలుసా.. ఈ సీరియల్ నటుడిని గుర్తు పట్టలేరుగా!
హమ్మయ్య! అల్లు అర్జున్ కి ఓ గండం గట్టెక్కింది... ఇక ఎంచక్కా అక్కడికి చెక్కేయొచ్చు!

అందుకే ఈ వినాయక ఆలయాన్ని ఎంతో అద్భుతమైన ఆలయంగా భావిస్తారు.ఈ ఆలయం 12వ శతాబ్ది కాలం నాటిదనీ, 1317 సంవత్సరంలో ఈ ఆలయం నిర్మించారని, ఈ ఆలయానికి 2300 సంవత్సరాల చరిత్ర ఉన్నదనీ చరిత్రకారులు తెలియజేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు