కార్టూన్ లాగా మారడానికి ఆమె ఏకంగా రూ.77 లక్షలు ఖర్చు చేసేసింది?

వినాశకాలే విపరీత బుద్ధి అన్నారు పెద్దలు.ఏమో ఎవరి పిచ్చి వారిది.

 Did She Spend Rs 77 Lakh To Become A Cartoonist, Cartoon, Chnageing, 77 Lakhs,-TeluguStop.com

మనలో అనేకమంది కొన్నికొన్ని విషయాలపట్ల విపరీతమైన వ్యామోహం కలిగి వుంటారు.కొంతమందికి చెప్పులంటే పిచ్చి, ఇంకొంతమందికి బట్టలంటే పిచ్చి, మరికొంతమందికి వాహనాలంటే పిచ్చి, వేరొకరికి ఎలక్ట్రినిక్ గాడ్జెట్స్ అంటే పిచ్చి.

ఇక్కడి వరకు ఓకే కానీ, ఇంకొంతమందికి అందమంటే విపరీతమైన మోజు ఉంటుంది.అది అందరికీ వుండేదేలే అని అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్నా.ఇక్కడ చెప్పబోయేది మన అందం గురించి కాదు.వేరొకరిలాగ అందంగా మారాలని అనుకుంటూ వుంటారు.దానికోసం ఏమైనా చేస్తారు వీరు.

ఇటీవల జపాన్Japan కు చెందిన ఓ వ్యక్తి.

కుక్కగా కనిపించాలన్న తపనతో ఏకంగా లక్షలు ఖర్చు చేసి కుక్కలాగా మారిపోయిన ఘటన ఇంకా మరువక ముందే ఇంకో వింత చోటుచేసుకుంది.వివరాల్లోకి వెళ్తే.స్వీడన్ కు చెందిన ‘పిక్సీ ఫాక్స్‘ చిన్నతనం నుంచి కార్టూన్స్ చూస్తూ పెరిగింది.ముఖ్యంగా కార్టూన్ లోని అమ్మాయిల రూపు రేఖలు ఉదాహరణకు బార్బిడాల్ పిక్సీ ని అమితంగా ఆకర్షించాయి.

కార్టూన్ షోల్లోని హూ ఫ్రేమ్డ్ రోజర్ రాబిట్‌లోని జెస్సికా రాబిట్, స్లీపింగ్ బ్యూటీలోని అరోరా, కూల్ వరల్డ్‌లోని హోలలీ వుడ్ క్యారెక్టర్లంటే అమితంగా ఆమెకు ఇష్టమట.దీంతో తాను ఎలాగైనా సరే.కార్టూన్ లో కనిపించే అమ్మాయిగా మారాలని అనుకుంది.

Telugu Lakhs, Barbidol Pixie, Cartoon, Cartoonist, Japan, Pixie Fox, Plastic, La

ఇంకేముంది, కట్ చేస్తే.కొన్ని సంవత్సరాల పాటు.తన శరీర భాగాల్లో వివిధ ప్లాస్టిక్ సర్జీలు చేయించుకుని.

చివరికి 2016లో ‘లివింగ్ కార్టూన్‘ అమ్మాయిగా మారింది.ఇలా తనకు ఇష్టమైన రూపంలోకి మారడం కోసం పిక్సీ ఫాక్స్ అక్షరాల రూ.77 లక్షల 60వేలు ఖర్చు చేసిందట.ప్రస్తుతం 32 ఏళ్ల పిక్సీని ప్రపంచం లివింగ్ కార్టూన్‌గా గుర్తిస్తోంది.

దాంతో సెలబ్రిటీ హోదాతో సోషల్ మీడియాలో సందడి చేస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube