డైలీ న్యూస్ రౌండప్ టాప్ 20

1.కాళేశ్వరం ప్రాజెక్టు పై కోదండరామ్ కామెంట్స్

Telugu Cmjagan, Cm Kcr, Garibkalyan, Jayaprada, Kvpramachandra, Ktr, Telangana,

ఆంధ్ర కాంట్రాక్టర్ కోసమే కాలేశ్వరం ప్రాజెక్టు అని, కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల కేవలం ఆంధ్రా కాంట్రాక్టర్ల ప్రయోజనం చేకూరిందని టీజేఎస్ పార్టీ అధ్యక్షుడు కోదండరాం విమర్శించారు. 

2.కాంగ్రెస్ సీనియర్ నేత కెవిపి ఇంట్లో చోరీ

 కాంగ్రెస్ సీనియర్ నేత కె వి.పి రామచంద్ర రావు ఇంట్లో భారీ చోరీ జరిగింది.46 లక్షల విలువగల 49 గ్రాములు డైమండ్ నెక్లెస్ మాయమైంది.ఈ వ్యవహారంపై పోలీసులకు కెవిపి భార్య సునీత ఫిర్యాదు చేశారు. 

3.చేనేత కు 60 కోట్లు మంజూరు

 

 Telangana Headlines, News Roundup, Top20news, Telugu News Headlines, Todays Gold-TeluguStop.com
Telugu Cmjagan, Cm Kcr, Garibkalyan, Jayaprada, Kvpramachandra, Ktr, Telangana,

చేనేత రంగానికి 60 కోట్లు మంజూరు చేస్తూ బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్ర వెంకటేశం ఉత్తర్వులు జారీ చేశారు. 

4.హజ్ యాత్రికులకు సౌకర్యం కల్పించండి :  హోంమంత్రి

  హజ్ యాత్రికులకు విమానాశ్రయం వద్ద అవసరమైన సౌకర్యాలు కల్పించాలని అధికారులను మంత్రి మహమూద్ అలీ ఆదేశించారు. 

5.టి టి డబ్ల్యూ ఆర్ జె సి సెట్ -22 ఫలితాల విడుదల

 

Telugu Cmjagan, Cm Kcr, Garibkalyan, Jayaprada, Kvpramachandra, Ktr, Telangana,

తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ పరిధిలోని జూనియర్ కళాశాలలో ప్రవేశాలకు నిర్వహించిన టి టి డబ్ల్యూ ఆర్ జె సి సెట్ 2022 ఫలితాలను మంత్రి సత్యవతి రాథోడ్ విడుదల చేశారు. 

6.ఇంటర్ పౌరశాస్త్రం ఉంటుంది

  ఇంటర్మీడియట్ విద్య లో భాగంగా ఉన్న సబ్జెక్టు నుంచి సివిక్స్ ( పౌరశాస్త్రం ) ను తొలగిస్తున్నట్లు జరుగుతున్న ప్రచారం వాస్తవం కాదని ఇంటర్ బోర్డు కార్యదర్శి తెలిపారు. 

7.ఆస్ట్రేలియా కాన్సులేట్ ఏర్పాటు చేయండి

 

Telugu Cmjagan, Cm Kcr, Garibkalyan, Jayaprada, Kvpramachandra, Ktr, Telangana,

తెలంగాణ ఆస్ట్రేలియా మధ్య విద్యా వ్యాపార వాణిజ్య సంబంధాలు పెరుగుతున్నందున ఆస్ట్రేలియా కౌన్సిల్ జనరల్ కార్యాలయాన్ని హైదరాబాద్ లో ఏర్పాటు చేయాలని చెన్నై లోని ఆస్ట్రేలియా కౌన్సిల్ జనరల్ సారా కిర్లే ను తెలంగాణ ఐటి పరిశ్రమ శాఖ మంత్రి కేటీఆర్ కోరారు. 

8.టికాయత్ పై దాడి చేసిన వారిని శిక్షించాలి

  భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేష్ టికాయత్ పై బెంగళూరులో సిరా తో దాడి చేయడాన్ని తెలంగాణ మంత్రి నిరంజన్ రెడ్డి ఖండించారు.వెంటనే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. 

8.జూలై 4 నుంచి డీఎడ్ పరీక్షలు

 డిప్లమో ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ( డియెడ్ ) పరీక్షల షెడ్యూల్ను ప్రకటించారు జూలై 4 నుంచి 9 వరకు మొత్తం ఆరు పేపర్లకు సంబంధించిన పరీక్షలు నిర్వహించనున్నారు. 

9.జూన్ 3 నుంచి బడిబాట

 

Telugu Cmjagan, Cm Kcr, Garibkalyan, Jayaprada, Kvpramachandra, Ktr, Telangana,

రాష్ట్రంలో జూన్ మూడో తేదీ నుంచి 30వ తేదీ వరకు బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. 

10.కేంద్రంపై కవిత విమర్శలు

  కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం పాలనలో విఫలమైందని టిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. 

11.లక్ష్మణ్ కు బిజెపి రాజ్యసభ సీటు

 

Telugu Cmjagan, Cm Kcr, Garibkalyan, Jayaprada, Kvpramachandra, Ktr, Telangana,

బిజెపి ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కే లక్ష్మణ్ కు రాజ్యసభ సీటు లభించింది.ఉత్తరప్రదేశ్ నుంచి ఆయనకు ప్రాతినిధ్యం కల్పిస్తూ పార్టీ నాయకత్వం నిర్ణయం తీసుకుంది. 

12.రెడ్డి, వైశ్య కార్పొరేషన్ లు ఏర్పాటు చేయాలి

  ఆగస్టు లోగా రెడ్డి వైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని లేకుంటే వేలాది మందితో ఆమరణ నిరాహార దీక్ష చేపడతామని తెలంగాణ ఓసీ సామాజిక సంఘాల సమైక్య జాతీయ అధ్యక్షుడు పోలాటి రామారావు హెచ్చరించారు. 

13.బిజెపిలో చేరనున్న హార్దిక్ పటేల్

 

Telugu Cmjagan, Cm Kcr, Garibkalyan, Jayaprada, Kvpramachandra, Ktr, Telangana,

కాంగ్రెస్ పార్టీ మాజీ నేత, పటేల్ ఉద్యమ నాయకుడు హార్దిక్ పటేల్ జూన్ 2న బిజెపిలో చేరబోతున్నారు. 

14.కేంద్ర వ్యవసాయ పథకాలపై అవగాహన కార్యక్రమం

  తిరుపతి బాకర పేట లో నేడు కేంద్ర వ్యవసాయ పథకాలపై అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. 

15.నేడు విశాఖ రానున్న సుప్రీంకోర్టు న్యాయమూర్తి

 

Telugu Cmjagan, Cm Kcr, Garibkalyan, Jayaprada, Kvpramachandra, Ktr, Telangana,

నేడు సుప్రీం కోర్టు న్యాయమూర్తి ఉదయ్ ఉమేష్ లలిత్ విశాఖ రానున్నారు.నాలుగు రోజుల పాటు ఆయన వివిధ ప్రాంతాలను సందర్శించనున్నారు. 

16.గరీబ్ కళ్యాణ సమ్మేళన కార్యక్రమం

  నేడు ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా రాజమండ్రిలో కేంద్ర పొగాకు పరిశోధన సంస్థ ఆధ్వర్యంలో గరీబ్ కళ్యాణ్ సమ్మేళన కార్యక్రమం నిర్వహించనున్నారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ హాజరుకానున్నారు. 

17.సిద్దేశ్వరం ప్రాజెక్ట్ సాధన సమితి ఆధ్వర్యంలో జల దీక్ష

  నంద్యాల జిల్లా సిద్దేశ్వరం ప్రాజెక్టు సాధన సమితి ఆధ్వర్యంలో సిద్ధేశ్వరం వద్ద దీక్ష చేపట్టనున్నారు.ఈ నేపథ్యంలో 144 సెక్షన్ ను పోలీసులు విధించారు. 

18.భీమవరం మావుళ్ళమ్మ ఉత్సవాలకు భారీ ఏర్పాట్లు

 

Telugu Cmjagan, Cm Kcr, Garibkalyan, Jayaprada, Kvpramachandra, Ktr, Telangana,

పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం శ్రీ మావుళ్ళమ్మ ఉత్సవాల కు భారీగా ఏర్పాట్లు చేపట్టారు.జూన్ ఒకటి నుంచి 27వ తేదీ వరకు శ్రీమావుళ్ళమ్మ జేష్ట మాస ఉత్సవాలు నిర్వహిస్తారు. 

19.శ్రీశైలం స్వామి వారి ఉచిత సర్వదర్శనం వేళల్లో మార్పులు

  శ్రీశైలంలో మంగళ , శుక్రవారాల్లో స్వామి వారి ఉచిత సర్వదర్శనం ఉంటుంది.అయితే ఈ ఉచిత సర్వదర్శనం వేళల్లో మార్పులు చేశారు.నేటి నుంచి వారంలో నాలుగు రోజులపాటు అనగా మంగళవారం నుంచి శుక్రవారం వరకు మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు భక్తులందరికీ శ్రీ స్వామివారి సర్వదర్శనానికి అనుమతిస్తారు. 

20.తెలుగు రాజకీయాల్లోకి అడుగు పెడతా : జయప్రద

 

Telugu Cmjagan, Cm Kcr, Garibkalyan, Jayaprada, Kvpramachandra, Ktr, Telangana,

ప్రముఖ నటి పార్లమెంటు మాజీ సభ్యురాలు బిజెపి నేత జయప్రద ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.త్వరలోనే తెలుగు రాజకీయాల్లోకి అడుగు పెడతానంటూ ఆమె వ్యాఖ్యానించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube