కార్టూన్ లాగా మారడానికి ఆమె ఏకంగా రూ.77 లక్షలు ఖర్చు చేసేసింది?

వినాశకాలే విపరీత బుద్ధి అన్నారు పెద్దలు.ఏమో ఎవరి పిచ్చి వారిది.

మనలో అనేకమంది కొన్నికొన్ని విషయాలపట్ల విపరీతమైన వ్యామోహం కలిగి వుంటారు.కొంతమందికి చెప్పులంటే పిచ్చి, ఇంకొంతమందికి బట్టలంటే పిచ్చి, మరికొంతమందికి వాహనాలంటే పిచ్చి, వేరొకరికి ఎలక్ట్రినిక్ గాడ్జెట్స్ అంటే పిచ్చి.

ఇక్కడి వరకు ఓకే కానీ, ఇంకొంతమందికి అందమంటే విపరీతమైన మోజు ఉంటుంది.అది అందరికీ వుండేదేలే అని అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్నా.

ఇక్కడ చెప్పబోయేది మన అందం గురించి కాదు.వేరొకరిలాగ అందంగా మారాలని అనుకుంటూ వుంటారు.

దానికోసం ఏమైనా చేస్తారు వీరు.ఇటీవల జపాన్ Japan కు చెందిన ఓ వ్యక్తి.

కుక్కగా కనిపించాలన్న తపనతో ఏకంగా లక్షలు ఖర్చు చేసి కుక్కలాగా మారిపోయిన ఘటన ఇంకా మరువక ముందే ఇంకో వింత చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే.స్వీడన్ కు చెందిన 'పిక్సీ ఫాక్స్' చిన్నతనం నుంచి కార్టూన్స్ చూస్తూ పెరిగింది.

ముఖ్యంగా కార్టూన్ లోని అమ్మాయిల రూపు రేఖలు ఉదాహరణకు బార్బిడాల్ పిక్సీ ని అమితంగా ఆకర్షించాయి.

కార్టూన్ షోల్లోని హూ ఫ్రేమ్డ్ రోజర్ రాబిట్‌లోని జెస్సికా రాబిట్, స్లీపింగ్ బ్యూటీలోని అరోరా, కూల్ వరల్డ్‌లోని హోలలీ వుడ్ క్యారెక్టర్లంటే అమితంగా ఆమెకు ఇష్టమట.

దీంతో తాను ఎలాగైనా సరే.కార్టూన్ లో కనిపించే అమ్మాయిగా మారాలని అనుకుంది.

"""/"/ ఇంకేముంది, కట్ చేస్తే.కొన్ని సంవత్సరాల పాటు.

తన శరీర భాగాల్లో వివిధ ప్లాస్టిక్ సర్జీలు చేయించుకుని.చివరికి 2016లో 'లివింగ్ కార్టూన్' అమ్మాయిగా మారింది.

ఇలా తనకు ఇష్టమైన రూపంలోకి మారడం కోసం పిక్సీ ఫాక్స్ అక్షరాల రూ.

77 లక్షల 60వేలు ఖర్చు చేసిందట.ప్రస్తుతం 32 ఏళ్ల పిక్సీని ప్రపంచం లివింగ్ కార్టూన్‌గా గుర్తిస్తోంది.

దాంతో సెలబ్రిటీ హోదాతో సోషల్ మీడియాలో సందడి చేస్తోంది.

ఇదేం పోయేకాలం.. పీహెచ్‌డీ చేసి అడల్ట్ స్టార్‌గా మారింది.. కట్ చేస్తే..?