ఇంట్లో షుగర్‌ పేషంట్‌ ఉంటే ఈ అయిదు తప్పకుండా మీ ఇంట్లో ఉంచుకోండి

అంతర్జాతీయ ఆరోగ్య సంస్థ నిర్వహించిన ఒక సర్వేలో అన్ని వ్యాదులకంటే షుగర్‌ వ్యాది అత్యంత వేగంగా పెరుగుతుందని, ప్రపంచ వ్యాప్తంగా గత పదేళ్లలో షుగర్‌ పేషంట్స్‌ సంఖ్య 250 రెట్లు పెరిగినట్లుగా తేలింది.

మారుతున్న ఆహారపు అలవాట్లు మరియు ఇతరత్ర కారణాల వల్ల షుగర్‌ వ్యాదిగ్రస్తుల సంఖ్య అత్యధికంగా పెరుగుతోంది.

ఇండియాలో కూడా షుగర్‌ వ్యాదిగ్రస్తుల సంఖ్య ఆందోళనకర స్థాయిలో ఉందని నిపుణులు చెబుతున్నారు.షుగర్‌ వ్యాది ప్రాణాంతకం అయితే కాదు.

కాస్త జాత్త్రలు తీసుకుని, డైట్‌ ఫాలో అయితే ఖచ్చితంగా షుగర్‌ తో నిండు నూరేళ్లు బతికేయొచ్చు అనేది వైద్యుల సలహా.షుగర్‌ వ్యాదితో బాధపడుతున్న వారు తప్పకుండా డైట్‌ను ఫాలో అవ్వాలి.

ముఖ్యంగా స్వీట్స్‌ అస్సలే తీసుకోవద్దనే విషయం తెల్సిందే.దాంతో పాటుమూడు పూటల అన్నం కాకుండా కాస్త మార్చి తినడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

Advertisement

షుగర్‌ ఉన్న వారు ఎక్కువగా తినాల్సినవి ఏంటో ఇప్పుడు చూద్దాం.

బీన్స్‌ :

షుగర్‌ వ్యాదిగ్రస్తులు బలమైన ఆహారం తీసుకోవాలంటే కాస్త వెనకా ముందు ఆలోచించాల్సి ఉంటుంది.ఎందుకంటే పండ్లు తింటే షుగర్‌ పెరగుతుంది, మరేదైనా తీసుకోవాలన్నా షుగర్‌ పెరుగుతుందేమో అనే భయం ఉంటుంది.

అయితే బీన్స్‌ తినడం వల్ల ఎలాంటి షుగర్‌ పెరగకపోవడంతో పాటు పండ్లు తిన్నట్లుగా ఎనర్జి వస్తుంది.మినరల్స్‌, మెగ్నీషియం, పొటాషియం వంటి ఎన్నో పోషకాలు లభిస్తాయి.దాంతో పాటు షుగర్‌ లెవల్స్‌ చాలా వరకు సమానంగా ఉండేలా బీన్స్‌ పనిచేస్తాయి.

వేప ఇగురు :

ఇంట్లో వేప చెట్టు ఉంటే ప్రతి రోజు రెండు లేదా మూడు వేప ఆకులను నమలడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.వేప ఇగుర్ల వల్ల షుగర్‌ కంట్రోల్‌ చాలా వరకు అవుతుంది.

పపాయ :

డయాబెటీస్‌ వారు వారంలో కనీసం ఒక్కసారైనా పపాయ తింటే బాగుంటుందని డాక్టర్లు సూచిస్తున్నారు.

అమ్మతోడు ఆస్తి కోసం కాదు.. మంచు మనోజ్ సంచలన వ్యాఖ్యలు నెట్టింట వైరల్!
రథ సప్తమి ఎందుకు చేస్తారో తెలుసా?

జొన్న లేదా రాగులు :

అతిగా పాలీస్‌ చేసిన బియ్యం తినడం వల్ల షుగర్‌ వ్యాదిగ్రస్తులు అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.అందుకే షుగర్‌ వ్యాదిగ్రస్తులు ఎక్కువగా జొన్న గటక లేదా రాగుల సంకటి తినడం వల్ల మంచి ఉపయోగాలు ఉంటాయి.రోజులో కనీసం ఒక్కసారి అయినా జొన్న లేదా రాగులతో చేసిన ఆహారం తీసుకోవాలి.

Advertisement

కాకరకాయ :

షుగర్‌ వ్యాదిగ్రస్తులు లేత కాకరకాయ వారంలో ఒకటి లేదా రెండు నమిలితే మంచిది.చాలా వరకు షుగర్‌ లెవల్‌గా ఉంటుందట.

ఒంట్లో షుగర్‌ ఉందని భయపడకుండా ఈ డైట్‌ ను ఫాలో అయ్యి ట్యాబ్లెట్స్‌ను రెగ్యులర్‌గా వేసుకుంటే ఈజీగా షుగర్‌ ఉన్నా దాన్ని కంట్రోల్‌ పెట్టుకోవచ్చు.నలుగురికి ఉపయోగపడే ఈ విషయాన్ని తప్పకుండా షేర్‌ చేయండి.

తాజా వార్తలు