శ్రీకాకుళం జిల్లాలో ధర్మాన ప్రసాదరావు సీనియర్ నాయకుడు.నాలుగున్నర దశాబ్దాల రాజకీయజీవితం ఆయన సొంతం.
రాజకీయంలో ఎన్నో ఒడిదుడుకులను చూసిన ధర్మాన ప్రసాదరావు 30 సంవత్సరాల వయసులోనే మంత్రిగా బాధ్యతలు స్వీకరించి నాటి కాంగ్రెస్ ముఖ్యమంత్రుల చేత శభాష్ అనిపించుకున్నాడు.మంచి సబ్జెక్టు, ఏ విషయాన్నైనా విడమరచి ప్రజలకు అర్థమయ్యేలా చెప్పడం ధర్మాన స్పెషాలిటీ.
అంతటి చరిత్ర ఉన్న ధర్మాన ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఈ పేరు వింటే చాలు ఉలిక్కిపడుతున్నారు.ఆయన నోట నిత్యం పవన్ కళ్యాణ్, జనసేన జపమే వినిపిస్తుంది.
జిల్లాలో వైసీపీకి పట్టుకున్న జనసేన ఫీవర్ :
ధర్మాన ప్రసాదరావు శ్రీకాకుళం జిల్లాలో సీనియర్ నాయకుడు.ఎన్నోసార్లు ఎన్నికల్లో పోటీచేసి గెలిచిన నాయకుడు ఆయన.సుదీర్ఘకాలం మంత్రిగా పనిచేసిన రికార్డు కూడా ఆయనకే సొంతం.ప్రస్తుతం రెవెన్యూశాఖ మంత్రిగా కొనసాగుతున్న ధర్మాన ప్రసాదరావు 2004, 2009 లో జిల్లాలో కాంగ్రెస్ ప్రాబల్యం మరింత పెంచడానికి ఆయన చేసిన కృషి ఎవ్వరు మర్చిపోలేరు.
అదే ఊపుతో 2024 ఎన్నికల్లో వైఎస్సార్సీపీని గెలిపించాలని జగన్ భావిస్తున్నాడట.శ్రీకాకుళం జిల్లాలో ఒకవైపు టీడీపీ, మరోవైపు జనసేన చాప కింద నీరులా విస్తరిస్తున్నాయి.2019 ఎన్నికల్లో 2వేలు, 3 వేలు కూడా రాని జనసేన పార్టీ ఇప్పుడు పూర్తి స్థాయిలో బలపడుతుందని వచ్చే ఎన్నికల్లో కొన్ని సీట్లు గెలిచే అవకాశం కూడా ఉందని వైసిపి భావిస్తోందట.
పదివేల మార్క్ ఓట్లు జనసేన పొందితే వైసిపికి ఇబ్బందులు తప్పవని ధర్మాన భావిస్తున్నాడట.
జిల్లాలో కాపు ఓటర్లు అధికంగా ఉన్నారు, వారి వల్ల ప్రభావితమయ్యే సీట్లు కూడా ఉన్నాయి వారి ఓట్లు జనసేనకు వస్తే వైసిపికి ఇబ్బందులు తప్పవు.అలాగే కొంతమంది బీసీలు కూడా జనసేన వైపు వెళ్తే వైసీపీ ఆశలు గల్లంతు అవుతాయి.

ధర్మాన సొంత జిల్లాలో జనసేన చాలా బాగా ఉంది.వైసీపీ గడపగడప కార్యక్రమంలో జనసేన నాయకులు బ్యానర్లు కట్టి ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు.మంత్రి కార్యక్రమాన్ని కూడా అడ్డుకుని విమర్శలు చేస్తున్నారట.దీంతో ధర్మాన మొదటిసారిగా జనసేన పై స్పందించాల్సి వచ్చింది.పవన్ కళ్యాణ్ కు సినీ గ్లామర్ మాత్రమే ఉందని అంటున్న ధర్మాన ఏమాత్రం తారుమారైన వైసిపి ఇబ్బంది పడక తప్పదు అని భావిస్తున్నాడట.యువత జనసేన వైపు మొగ్గు చూపడంతో వైసిపి ఆశించిన స్థాయిలో ఓట్లు రావని సమాచారం.
ఇక టిడిపి జనసేన పొత్తు పెట్టుకుంటే మాత్రం వైసీపీ గడ్డుకాలమే అని అంటున్నారు విశ్లేషకులు.మొత్తానికి ధర్మాన పవన్ కళ్యాణ్ ని తలుచుకుంటున్నాడు అంటేనే జనసేన స్ట్రాంగ్ అవుతుందని అర్థం అంటూ జనసైనికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.