మాకు కలిసి ఉండాలని లేదు.. ధనుష్ దంపతుల సంచలన వ్యాఖ్యలు వైరల్!

ఈ మధ్య కాలంలో ధనుష్ , నయనతార( Dhanush , Nayanthara ) వివాదం ద్వారా వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే.

అయితే ధనుష్ లాయర్ ఈ వివాదం గురించి మాట్లాడారే తప్ప ధనుష్ ఈ వివాదం గురించి డైరెక్ట్ గా రియాక్ట్ కాలేదు.

మరోవైపు ధనుష్, అతని భార్య విడాకులు తీసుకోవాలని చాలా కాలం క్రితమే నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.తాజాగా ధనుష్, ఐశ్వర్య చెన్నై ఫ్యామిలీ వెల్ఫేర్ కోర్టు( CHENNAI FAMILY WELFARE COURT ) ఎదుట హజరు కావడం జరిగింది.

తాము కలిసి ఉండాలని భావించడం లేదని విడిపోతామని ధనుష్ దంపతులు కోర్టుకు వెల్లడించడం గమనార్హం.విడిపోవడానికి గల కారణాలను సైతం ధనుష్ ఐశ్వర్య కోర్టుకు తెలియజేశారు.

ఈ కేసుకు సంబంధించిన తుది తీర్పును కోర్టు ఈ నెల 27వ తేదీకి వాయిదా వేయడం గమనార్హం.ఐశ్వర్య సూపర్ స్టార్ రజనీకాంత్ ( Superstar Rajinikanth )పెద్ద కుమార్తె అనే సంగతి తెలిసిందే.

Advertisement
Dhanush And His Wife Sensational Comments Details Inside Goes Viral In Social Me

వయస్సులో ధనుష్ తో పోలిస్తే ఐశ్వర్య పెద్ద కావడం గమనార్హం.

Dhanush And His Wife Sensational Comments Details Inside Goes Viral In Social Me

ఐశ్వర్య, ధనుష్ అక్క మంచి స్నేహితులు కాగా ధనుష్, ఐశ్వర్య ఒకరినొకరు ప్రేమించుకొని పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు.2022లో ధనుష్ తన భార్యతో విడిపోతున్నానని సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టగా ఆ పోస్ట్ నెట్టింట వైరల్ అయింది.ఈ ఏడాది ఆరంభంలో ధనుష్, ఐశ్వర్య విడాకుల కోసం కోర్టును ఆశ్రయించగా ధనుష్ ఐశ్వర్య విడిపోవడానికే ప్రాధాన్యత ఇచ్చారు.

Dhanush And His Wife Sensational Comments Details Inside Goes Viral In Social Me

ధనుష్, ఐశ్వర్యలను కలపాలని రజనీకాంత్ ప్రయత్నాలు చేసినా ఫలితం లేకుండా పోయిందని తెలుస్తోంది.ధనుష్ ప్రస్తుతం కుబేర సినిమాతో( Kubera ) బిజీగా ఉన్నారు.శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కుతోంది.

వచ్చే ఏడాది ఈ సినిమా థియేటర్లలో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయని సమాచారం అందుతోంది.నాగార్జున ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారనే సంగతి తెలిసిందే.

కూలీ కోసం బుట్ట బొమ్మ... కళ్ళు చెదిరే రేంజిలో రెమ్యూనరేషన్?
Advertisement

తాజా వార్తలు