అర్హ పుట్టినరోజు.. వైరల్ అవుతున్న స్టార్ హీరో అల్లు అర్జున్ ఎమోషనల్ పోస్ట్!

స్టార్ హీరో అల్లు అర్జున్ ( Allu Arjun )కు ప్రేక్షకుల్లో ఊహించని స్థాయిలో క్రేజ్ ఉంది.అల్లు అర్జున్ రెమ్యునరేషన్ విషయంలో సైతం టాప్ లో ఉన్నారని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

 Allu Arjun Emotional Post Goes Viral In Social Media Details Inside ,allu Arju-TeluguStop.com

అల్లు అర్హ తాజాగా అన్ స్టాపబుల్ షోలో సందడి చేయగా అటజని కాంచె పద్యాన్ని అలవోకగా చెప్పిన అర్హపై నెటిజన్ల నుంచి ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.ఈరోజు అల్లు అర్హ పుట్టినరోజు కావడం గమనార్హం.

అల్లు అర్హ పుట్టినరోజు సందర్భంగా బన్నీ ఇన్ స్టాగ్రామ్ వేదికగా పోస్ట్ చేశారు.8 సంవత్సరాల స్వచ్చమైన ఆనందం.నా లిటిల్ అర్హ నా లైఫ్ ను మధురంగా మార్చిందని బన్నీ చెప్పుకొచ్చారు.నీపై అనంతమైన ప్రేమతో మీ నాన్న అంటూ బన్నీ పోస్ట్ చేశారు.అల్లు అర్జున్ చేసిన ఈ పోస్ట్ నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది.బన్నీ చేసిన ఈ పోస్ట్ కు 11 లక్షలకు పైగా లైక్స్ వచ్చాయి.

Telugu Allu Arha, Allu Arjun, Bunny, Tollywood-Movie

మరోవైపు అల్లు అర్హ ( Allu Arha )తెలుగు స్పీకింగ్ స్కిల్స్ కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.అల్లు అర్జున్ కెరీర్ విషయానికి వస్తే మరికొన్ని రోజుల్లో పుష్ప ది రూల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.పుష్ప ది రూల్ సినిమా ఇతర భాషల్లో ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందనే చర్చ సైతం జరుగుతోంది.పుష్ప ది రూల్ మూవీ( Pushpa the rule movie ) బాక్సాఫీస్ ను రూల్ చేసే రేంజ్ లో హిట్ అవుతుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

Telugu Allu Arha, Allu Arjun, Bunny, Tollywood-Movie

అల్లు అర్జున్ ప్రభాస్ తర్వాత ఆ రేంజ్ లో టాలీవుడ్ ( Tollywood )నుంచి గుర్తింపును సొంతం చేసుకున్న హీరోగా గుర్తింపును సొంతం చేసుకోవడం ఖాయమని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.అల్లు అర్జున్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉండగా ఈ సినిమాలతో బాక్సాఫీస్ ను షేక్ చేయాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.బన్నీ రేంజ్ అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube