కీచక ఉపాధ్యాయుడి పైశాచికత్వం...!

యాదాద్రి భువనగిరి జిల్లా: పిల్లలకు పాఠాలు బోధిస్తూ విద్యాబుద్దులు చెప్పాల్సిన స్థానంలో ఉన్న ఓ ఉపాధ్యాయ ప్రభుద్దుడి బుద్ది గడ్డితిని పశువులా ప్రవర్తించిన ఘటన సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలో ఆలస్యంగా వెలుగు చూసింది.

వివరాల్లోకి వెళితే.

గుండాల మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడుగా పని చేస్తున్న అండెం మాధవరెడ్డి ఏడాది కాలంగా విద్యార్థినిలకు చాక్లెట్స్,పెసలు ఆశ చూపి వికృత చేష్టలు చేస్తూ లైంగిక దాడికి పాల్పడుతున్న అమానుష ఘటన ఓ పాపకు అనారోగ్యం చేయడంతో సారువారి బాగోతం బయటపడింది.ఆగ్రహంతో ఊగిపోయిన విద్యార్థుల తల్లిదండ్రులు స్కూలుకు వెళ్లగా అప్పటికే టీచర్ వెళ్లిపోవడంతో పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

మనవరాలు వయసున్న బాలికలపై గత కొంతకాలంగా లైంగిక దాడికి పాల్పడుతూ పైశాచిక ఆనందం పొందుతున్నట్లు తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు.పిల్లలకు చాక్లెట్లు,పైసలు ఆశ చూపి ఒళ్లంతా తడుముతూ ముద్దులు పెడుతూ అసహ్యంగా ప్రవర్తించి, విషయం అమ్మానాన్నలకు గానీ,ఇతరులకు చెప్పొద్దని కొట్టి భయపడేవాడని, దీంతో పిల్లలకు తమకు చెప్పలేదని బాధితులు వాపోయారు.

ఓ పాపకు అనారోగ్యం చేయడంతో విషయం బయటకు వచ్చిందన్నారు.తమ పిల్లల పట్ల దుర్మార్గంగా వ్యవహరించిన ప్రభుత్వ ఉపాధ్యాయుడిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకొని, తమకు న్యాయం చేయాలని కోరారు.

Advertisement

ఇదే విషయమై గుండాల ఎస్ఐ డి.యాకన్నను వివరణ కోరగా విద్యార్థుల తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.

Advertisement

Latest Video Uploads News